హ్యాట్రిక్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేసిన మూవీ జై లవకుశ. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. అయితే ఈరోజు అమెరికాలో ప్రీమియర్ షో వేశారు. ఆ షోని చూసిన ప్రముఖ సినీ క్రిటిక్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జై లవకుశ ఫస్ట్ రివ్యూ ఎలా ఉందంటే..
ఎన్టీఆర్ నటనఇదివరకు ఏ చిత్రంలో చేయనట్టుగా జై, లవ, కుశ పాత్రల్లో ఎన్టీఆర్ నటించారు. అన్ని రసాలను అద్భుతంగా పలికించారు. ఈ ఏడాది ఉత్తమనటుడి కేటగిరీల్లో తారక్ గట్టి పోటీ ఇవ్వడం గ్యారంటీ. రెండు పాటల్లో డ్యాన్స్ సూపర్ గా చేశారు.
రోనిత్ రాయ్సినిమాలో నటించిన వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ నెగిటివ్ రోల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు.
డైరక్టర్ పని తీరుబాబీ ఈ సినిమాని పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కించడంలో విజయవంతమయ్యారు. కథలో అక్కడక్కడ కొన్ని లోపాలు కనిపిస్తున్నప్పటికీ యాక్షన్ సీన్స్ మాస్ ప్రజలకు కిక్ ఇస్తాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంది.
సినిమాటోగ్రఫీ సూపర్పరిగెత్తించే స్క్రీన్ ప్లే, మూడ్ ని తెలిపే లైటింగ్, కెమెరా పనితనం సూపర్.
బ్యాక్ బోన్ గా బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ప్రధానంగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన నేపథ్య సంగీతం అదరహో అనిపించింది. కొన్ని సన్నివేశాల్లో డీఎస్పీ స్కోర్ ఫెంటాస్టిక్. కథకు దేవీ వెన్నుగా నిలిచారు.
మత్తెక్కించిన తమన్నామిల్కీ బ్యూటీ తమన్నా స్వింగ్ జరా స్పెషల్ సాంగ్ లో మత్తెక్కించింది.
చివరి మాట : ఫ్యాన్స్ కి జై లవకుశ పెద్ద ట్రీట్ లా ఉంటుంది. ఆ క్రిటిక్ ఇచ్చిన రేటింగ్ 3.5/5
ఈ రివ్యూ ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సందు రాశారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఫిల్మ్ ఫోకస్ రివ్యూ రేపు రానుంది.