అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు నోచుకోనున్న జై లవకుశ

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఎన్టీఆర్ తొలిసారి నటించిన సినిమా జై లవకుశ. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తారక్ నటవిశ్వరూపం చూపించారు. ముఖ్యంగా జై పాత్రలో ఎన్టీఆర్ నటన ప్రసంశలు అందుకుంది. అందుకే ఈ మూవీ తెలుగురాష్ట్రాల్లో కలక్షన్ల వర్షం కురిపించింది. వరుస అపజయాలతో ఇబ్బందుల్లో ఉన్న కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా లాభాలను తెచ్చి పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను ఒక రేంజ్ లో వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా తాజాగా అరుదైన గౌరవాన్ని అందుకుంది. నార్త్ కొరియాలో జరిగే బుచీయోన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండు రోజుల ప్రదర్శనకి గాను “జై లవకుశ” సినిమాను ఎంపిక చేశారు.

ఉత్తమ ఏషియన్ సినిమా విభాగంలో “జై లవకుశ” కి ఈ గౌరవం దక్కింది. ఈ చిత్రోత్సవంలో చోటు లభించిన ఏకైక తెలుగు సినిమా “జై లవకుశ” కావడం విశేషం. దీంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో “అరవింద సమేత వీర రాఘవ” సినిమాని చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతమందిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగె ఈ సినిమా అక్టోబర్ 10 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus