రిలీజ్ కి రెడీ అవుతున్న జై లవకుశ ట్రైలర్

  • August 30, 2017 / 08:36 AM IST

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న జై లవకుశ రెండు పాటల మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. రెండింటిలో ఒక పాటను కుశ పాత్రపై  రామోజీ ఫిలిం సెట్ లో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలోని మూడు క్యాక్టర్స్ లుక్స్ బయటికి రావడంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఆడియో రిలీజ్ తేదీని నేడును చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వచ్చేనెల మూడోవ తేదీన డైరక్ట్ గా పాటలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వానలు, గణేష్ నిమజ్జనం కారణంగా ఆడియో రిలీజ్ వేడుక నిర్వహించడం లేదని వివరించింది.

ఇక సెప్టెంబర్ 10 వ తేదీన అభిమానుల సమక్షంలో ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా థామస్, రాశీ ఖన్నా, నందిత రాజ్ లు నటిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేయనుంది. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ 21 న  థియేటర్లోకి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus