Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 15, 2026 / 01:16 PM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ర‌జ‌నీకాంత్‌ (Hero)
  • ర‌మ్య‌కృష్ణ‌ (Heroine)
  • విద్యాబాల‌న్‌, ఎస్‌జే సూర్య‌, హృతిక్ రోష‌న్‌, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, మిర్నామీన‌న్‌, యోగిబాబు త‌దిత‌రులు (Cast)
  • నెల్స‌న్ దిలీప్ కుమార్‌ (Director)
  • క‌ళానిధి మార‌న్‌ (Producer)
  • అనిరుధ్‌ (Music)
  • విజ‌య్ కార్తీక్ క‌న్న‌న్‌ (Cinematography)
  • ఆర్ నిర్మ‌ల్‌ (Editor)
  • Release Date : 15th అక్టోబ‌ర్‌ 2026
  • స‌న్ పిక్చ‌ర్స్‌ (Banner)

ర‌జ‌నీకాంత్ (Rajinikanth) హీరోగా నెల్స‌న్ డైరెక్ష‌న్‌లో రూపొందిన జైల‌ర్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఆరు వంద‌ల‌ కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ సినిమాకు సీక్వెల్‌గా జైల‌ర్ 2 (Jailer 2) రూపొందింది. జైల‌ర్ క‌థ‌, పాత్ర‌ల‌ను కొన‌సాగిస్తూ డైరెక్ట‌ర్ నెల్స‌న్ ఈ సీక్వెల్‌ను రూపొందించారు. జైల‌ర్ 2లో శివ‌రాజ్‌కుమార్‌, మోహ‌న్‌లాల్‌తో పాటు బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోష‌న్‌, త‌మిళ‌హీరో విజ‌య్ సేతుప‌తి గెస్ట్‌లుగా న‌టించ‌డంతో జైల‌ర్ 2పై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. ద‌స‌రా కానుక‌గా గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సీక్వెల్‌తో ర‌జ‌నీకాంత్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడా? సూప‌ర్ స్టార్‌కు డైరెక్ట‌ర్‌ నెల్స‌న్ మ‌రో హిట్టు ఇచ్చాడా? అంటే?

Jailer 2 Movie

Jailer 2 Movie Review And Rating

క‌థ‌: వ‌ర్మ‌ను చంపిన టైగ‌ర్ ముత్తువేల్ పాండియ‌న్ (Rajinikanth) త‌న కుటుంబంతో క‌లిసి అజ్ఞాత‌జీవితం గ‌డుపుతుంటారు. ఓ సూప‌ర్ మార్కెట్‌లో ప‌నిచేస్తుంటాడు. ముత్తు ఆచూకీ కోసం కేర‌ళ‌కు చెందిన‌ దిలీప్ (సూర‌జ్ వెంజ‌ర‌మూడు) అత‌డి గ్యాంగ్‌ వెతుకుతుంటారు. మూర్తి అనే లోక‌ల్ రౌడీని అడ్డుపెట్టునే దిలీప్ ద‌గ్గ‌ర‌కే ముత్తు వెళ‌తాడు. అత‌డి మ‌నుషులు అంద‌రిని చంపేస్తాడు. దిలీప్‌ను వ‌దిలేయాలంటే క‌ల్ప‌క్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయాల‌ని దిలీప్‌కు ముత్తు ఆర్డ‌ర్ వేస్తాడు. చ‌క్రి క‌ల్ప‌క్ (మిథున్ చ‌క్ర‌వ‌ర్తి) త‌న కొడుకు భోది (ఎస్‌జే సూర్య‌), కూతురు కాంత‌తో (విద్యాబాల‌న్‌) క‌లిసి గోవా గ‌డ‌గ‌డ‌లాడిస్తుంటాడు.

ముత్తుకు, క‌ల్ప‌క్ ఫ్యామిలీకి ఉన్న గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మేమిటి? సాధార‌ణ జైల‌ర్‌గా భావించి ముత్తుతో వైరానికి సిద్ధ‌మైన భోది, కాంత‌ల‌కు అత‌డి గురించి ఎలాంటి నిజాలు తెలిశాయి? కొడుకును చంపింది ముత్తు అనే నిజం అత‌డి భార్య‌కు తెలిసిందా? భోది, కాంత బారి నుంచి త‌న కుటుంబాన్ని కాపాడుకునే ప్ర‌య‌త్నంలో జైల‌ర్‌కు రాడీ (హృతిక్ రోష‌న్‌), న‌ర‌సింహా (శివ‌రాజ్‌కుమార్‌), మాథ్యూ (మోహ‌న్‌లాల్‌) ఎలాంటి సాయం చేశారు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Jailer 2 Movie Review And Rating

న‌టీన‌టుల ప‌నితీరు: జైల‌ర్ 2 (Jailer 2) మూవీకి ర‌జ‌నీకాంత్ (Rajinikanth) వ‌న్ మెన్ షోగా నిలిచాడు. మ‌రోసారి ముత్తువేల్ పాండియ‌న్ పాత్ర‌లో అద‌గొట్టేశారు. ఆయ‌న హీరోయిజం, ఎలివేష‌న్లు, డైలాగ్స్‌, యాక్ష‌న్ సీక్వెన్స్‌లు అభిమానుల‌కు విజువ‌ల్ ఫీస్ట్‌గా నిలుస్తాయి. జైల‌ర్ 2లో విల‌న్లు చాలా మందే ఉన్నారు. మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, విద్యా బాల‌న్‌, ఎస్‌జే సూర్య‌, సూర‌జ్ వెంజ‌ర‌మూడు నెగెటివ్ పాత్ర‌ల్లో ర‌జ‌నీకాంత్‌కు ధీటుగా క‌నిపించారు.

విద్యా బాల‌న్ రోల్‌ను చాలా బోల్డ్‌గా చూపించారు. డైలాగ్స్‌తో విల‌నిజాన్ని పండించిన తీరు బాగుంది. సూర‌జ్ వెంజ‌ర‌మూడు క్యారెక్ట‌ర్‌… జైల‌ర్ 1లోని వినాయ‌క‌న్ రోల్‌ను గుర్తుకుతెస్తుంది. మ్యాన‌రిజ‌మ్స్, లుక్ అలాగే ఉన్నాయి. స్టైలిష్ విల‌న్ పాత్ర‌లో ఎస్‌జేసూర్య ఆక‌ట్టుకున్నాడు. విల‌న్స్‌లో అత‌డి పాత్ర‌కే ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఉంది. మిథున్ చ‌క్ర‌వ‌ర్తి న‌ట‌న ఓకే.

గెస్ట్ రోల్స్‌ను డైరెక్ట‌ర్ నెల్స‌న్ ఈ సినిమాలో వాడుకున్న తీరు మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. హృతిక్ రోష‌న్ ఎంట్రీ ఎపిసోడ్ జైల‌ర్ 2కు హైలైట్‌గా నిలిచింది. మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌తో పాటు చివ‌ర‌లో విజ‌య్ సేతుప‌తి అతిథి పాత్ర‌ల్లో మెరిశారు. వారి స్క్రీన్ ప్ర‌జెన్స్ ఆక‌ట్టుకుంటుంది.

ర‌మ్య‌కృష్ణ‌, మిర్నామీన‌న్ పాత్ర‌ల‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదు. న‌మో నారాయ‌ణ‌న్‌, యోగిబాబు కామెడీ ఫ‌స్ట్ హాఫ్‌లో కొన్ని చోట్ల న‌వ్వించింది. స్పెష‌ల్ సాంగ్స్‌లో నోరా ఫ‌తేహి గ్లామ‌ర్‌తో మెప్పించింది. పూర్ణ సాంగ్ యావ‌రేజ్‌గా అనిపిస్తుంది.

Jailer 2 Movie Review And Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: శ్రీను వైట్ల టైప్‌లో నెల్స‌న్ త‌న‌కంటూ ఓ ఫార్మెట్ క్రియేట్ చేసుకున్నాడు. విల‌న్‌ను హీరో వెతుక్కుంటూ వెళ్ల‌డం, విల‌న్‌కు తెలియ‌కుండా అత‌డి చుట్టూనే ఉంటూ దెబ్బ‌కొట్ట‌డం, రివేంజ్ కోసం పావులుగా వాడుకునే కొన్ని పాత్ర‌లు…వాటి నుంచి జ‌న‌రేట్ అయ్యే ఫ‌న్‌తో నెల్స‌న్ సినిమాలు సాగుతుంటాయి.

జైల‌ర్ కూడా అదే ఫార్ములా క‌థ‌తో రూపొందింది. సీక్వెల్‌లో కూడా నెల్స‌న్ కొత్త‌గా ఆలోచించ‌లేదు. త‌న‌కు అచ్చొచ్చిన ఈ రూట్‌నే ఫాలో అయ్యాడు.

జైల‌ర్ 2తో (Jailer 2) పెద్ద‌గా క‌థంటూ ఏం లేదు. విల‌న్ గ్యాంగ్ నుంచి త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డం కోసం ముత్తు ఏం చేశాడు? ప్ర‌త్య‌ర్థులు వేసే ఎత్తుల‌ను ఎలా చిత్తు చేశాడు అన్న‌దే ఈ సినిమా క‌థ‌. ఈ సింపుల్ స్టోరీని ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌, గెస్ట్ పాత్ర‌ల స్టార్ వాల్యూతో ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలా రూపొందించాడు. ర‌జ‌నీకాంత్ నుంచి ఆడియెన్స్ ఏం కోరుకుంటారో ఆ అంశాల‌తో ఈ సినిమాను నింపేశాడు.

అనిరుధ్ బీజీఎమ్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. పాట‌లు తెలుగు ఆడియెన్స్‌కు క‌నెక్ట్ కావ‌డం క‌ష్ట‌మే. ప్రొడ‌క్ష‌న్ విష‌యంలో స‌న్ పిక్చ‌ర్స్ ఎక్క‌డ కాంప్ర‌మైజ్ కాలేదు. డైరెక్ట‌ర్ కోరిన‌దానికంటే ఎక్కువే ఈ సినిమా మేకింగ్ కోసం ఖ‌ర్చుపెట్టారు. సినిమాటోగ్రాఫ‌ర్ విజ‌య్ కార్తిక్ విజువ‌ల్స్ రిచ్‌గా ఉన్నాయి.

Jailer 2 Movie Review And Rating

విశ్లేష‌ణ: ర‌జ‌నీకాంత్ మాస్ ఇమేజ్‌ను అభిమానుల‌ను మెప్పించేలా ప‌వ‌ర్‌ఫుల్‌గా స్క్రీన్‌పై ఆవిష్క‌రించ‌డంలో న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు త‌డ‌బ‌డిపోతున్నారు. రీసెంట్ టైమ్‌లో డైరెక్ట‌ర్ నెల్స‌న్ మాత్ర‌మే ఈ విష‌యంలో స‌క్సెస్ అయ్యాడు. జైల‌ర్ తో ర‌జ‌నీకాంత్‌కు పెద్ద హిట్టు ఇచ్చాడు. తాజాగా జైల‌ర్‌కు సీక్వెల్‌గా వ‌చ్చిన జైల‌ర్ 2లో ఆ మ్యాజిక్‌ను మ‌రోసారి కంటిన్యూ చేశాడు. క‌థ‌, క‌థ‌నాల గురించి కాకుండా ర‌జ‌నీకాంత్ స్క్రీన్ ప్ర‌జెన్స్‌ను ఎంజాయ్ చేయాల‌ని అనుకునే ఆడియెన్స్‌ను జైల‌ర్ 2 (Jailer 2) మెప్పిస్తుంది.

జైల‌ర్‌కు కొన‌సాగింపుగానే ఈ క‌థ‌ను రాసుకున్నారు. ఫ‌స్ట్ హాఫ్‌లో దిలీప్ అండ్ గ్యాంగ్ జైల‌ర్ కోసం వెత‌క‌డం…వారికే తెలియ‌కుండా జైల‌ర్ …దిలీప్ గ్యాంగ్‌కు స్కెచ్ వేసే సీన్ల‌తో సాగుతుంది. జైల‌ర్ బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలియ‌కుండా మూర్తి అండ్ గ్యాంగ్ వేసే పంచ్‌లు, చేసే ప‌నుల నుంచి టైమ్‌పాస్ చేస్తాడు. ఇంట‌ర్వెల్‌లో వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్ బాగుంది. ఫైట్ లేకుండా విల‌న్ గ్యాంగ్ మొత్తాన్ని ముత్తు లేపేసే సీన్‌తో ఆడియెన్స్‌కు మంచి హై ఫీల్ ఇచ్చారు నెల్స‌న్‌. ఫ‌స్ట్ హాఫ్ మాస్ విల‌న్‌తో క‌థ న‌డిపించిన డైరెక్ట‌ర్‌…సెకండాఫ్‌లో క్లాస్ విల‌న్స్‌ను రంగంలోకి దింపారు. గోవా బ్యాక్‌డ్రాప్ చుట్టూ చాలా స్టైలిష్‌గా క‌థ సాగుతుంది. కొన్ని ట్విస్ట్‌లు బాగున్నాయి.

జైల‌ర్ 2 లో (Jailer 2) లాజిక్స్ అస్స‌లు లేవు. ఫ‌స్ట్ హాఫ్ టైమ్‌పాస్‌లానే అనిపిస్తుంది. క‌థ అస్స‌లు ముందుకు సాగ‌కుండా అక్క‌డిక‌క్క‌డే తిరుగుతున్న ఫీలింగ్ క‌లుగుతుంది.

Jailer 2 Movie Review And Rating

ఫోక‌స్ పాయింట్: ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లా జైల‌ర్ 2 నిలుస్తుంది. క‌థ గురించి కాకుండా ర‌జ‌నీకాంత్ మేనియాను ఎంజాయ్ చేయాల‌నుకునే ఫ్యాన్స్‌ను జైల‌ర్ 2 ఆక‌ట్టుకుంది.

రేటింగ్‌: 2.75/5

Click Here To Read in ENGLISH

Rating

2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Jailer 2 movie
  • #Nelson Dilipkumar
  • #Rajinikanth
  • #Ramya krishnan

Reviews

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

57 mins ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

21 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

23 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

23 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

23 hours ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

41 mins ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 hour ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

19 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

21 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version