Jailer 2: జైలర్ 2 తెలుగు రైట్స్.. ఇది మరీ టూ మచ్!

రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన ‘జైలర్’  (Jailer) మొదటి భాగం తెలుగు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌ చేసిన ఈ సినిమా రూ.47 కోట్లకు పైగా షేర్ సాధించడం ఇండస్ట్రీలో ఒక రికార్డుగానే నిలిచింది. దీంతో ‘జైలర్ 2’పై కూడా టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ రంగం లో భారీ ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ‘జైలర్ 2’ (Jailer 2) కోసం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బిగ్ వార్ మొదలైందట.

Jailer 2

ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి ఏకంగా రూ.60 కోట్ల ఆఫర్ పెట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది గత భాగానికి మూడింతల ధర కావడం గమనార్హం. అయితే నిర్మాతలు మాత్రం ఇంకా ఎక్కువ బిడ్డింగ్‌ కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ‘జైలర్ 2’ విడుదల సమయానికి ఎన్టీఆర్ (Jr NTR), హృతిక్ రోషన్  (Hrithik Roshan) కలిసి నటిస్తున్న ‘వార్ 2’ (War 2)  కూడా రిలీజ్ కానుంది.

పాన్ ఇండియా మార్కెట్‌లో హైప్ సొంతం చేసుకున్న వార్ 2 ముందు ‘జైలర్ 2’ (Jailer 2) నిలబడగలదా అనే ప్రశ్న ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జైలర్ 1కి పోటీ లేకపోవడం మేజర్ అడ్వాంటేజ్ అయ్యింది. కానీ ఈసారి అలాంటి లక్కీ వాతావరణం ఉండకపోవచ్చు. ఇంతకీ రూ.60 కోట్లు పెట్టి తెలుగు రైట్స్ కొనుగోలు చేయడం లాభదాయకమా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఒకవైపు రజనీకాంత్ ఫాలోయింగ్ ఉండగా, మరోవైపు మార్కెట్ లాజిక్స్ అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. ఈ డీల్ ఓవర్ కాన్ఫిడెన్స్ లో తీసుకున్నదిగా మారితే, తీవ్రమైన నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. రజనీ బ్రాండ్ హై లెవెల్లోనే ఉన్నా కూడా, ప్రతి సినిమా పరిస్థితి వేరు. ఇక ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు డిస్ట్రిబ్యూటర్లకు గట్టి లెక్కలు వేసుకోవాల్సిందే. లేదంటే ఇది టాప్ రిస్క్ డీల్‌గా మిగిలిపోతుందని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

ఆ టాలీవుడ్ స్టార్లు.. అలాంటి సీన్లలో ఇప్పటివరకు నటించలేదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus