సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’. ‘వరుణ్ డాక్టర్’ ‘బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై కళానిధి మారన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత అయిన సునీల్ నారంగ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు కలిసి రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ రావడంతో ‘జైలర్’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
దీంతో ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 6.31 cr |
సీడెడ్ | 1.76 cr |
ఉత్తరాంధ్ర | 1.70 cr |
ఈస్ట్ | 0.92 cr |
వెస్ట్ | 0.57 cr |
గుంటూరు | 1.10 cr |
కృష్ణా | 0.90 cr |
నెల్లూరు | 0.40 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 13.73 cr |
‘జైలర్’ చిత్రానికి తెలుగులో రూ.11.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.12.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.13.73 కోట్లు షేర్ ను రాబట్టి…. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.1.53 కోట్ల లాభాలను అందించింది. ఆదివారం రోజున కూడా భారీగా క్యాష్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!