Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Rajinikanth: రజనీకాంత్‌ సినిమాకు స్పెషల్‌ డేట్‌ ఫిక్స్‌!

Rajinikanth: రజనీకాంత్‌ సినిమాకు స్పెషల్‌ డేట్‌ ఫిక్స్‌!

  • October 28, 2022 / 02:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: రజనీకాంత్‌ సినిమాకు స్పెషల్‌ డేట్‌ ఫిక్స్‌!

తెలుగు స్టార్‌ హీరోలు సినిమా స్టార్ట్‌ అవుతోంది అంటే.. ఏ సీజన్‌కి వస్తుంది అనే లెక్కలు మొదలుపెట్టుకుంటారు ఫ్యాన్స్‌. దగ్గరలో సంక్రాంతి ఉందా? సమ్మర్‌కి వస్తుందా? దసరాకు తీసుకొస్తారా? దీపావళికి అవకాశం ఉందా? అంటూ అంచనాలు మొదలైపోతాయి. అదే తమిళనాట స్టార్‌ హీరోల సినిమాలు అంటే కచ్చితంగా ఆలోచించే తేదీలు అయితే ఏప్రిల్ 14 లేదంటే దీపావళి. ఇప్పుడు రజనీకాంత్‌ కొత్త సినిమాకు వీటిలోనే ఓ డేట్‌ ఫిక్స్‌ అయ్యిందంటున్నారు.

‘బీస్ట్‌’ సినిమాతో ఇటీవల ఇబ్బందికర ఫలితం అందుకున్న నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌.. తన నెక్స్ట్‌ సినిమాను రజనీకాంత్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై చిత్రబృందం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ సంవత్సరాది అయిన ఏప్రిల్‌ 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉందట. వినోదం, థ్రిల్లింగ్‌ అంశాలు..

ముఖ్యంగా రజనీ అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో ‘జైలర్‌’ సినిమా రూపొందుతోందని సమాచారం. ఈ సినిమాలో రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే యువ కథానాయకుడు శివ కార్తికేయన్‌ ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరవనున్నాడట. ఏప్రిల్‌ 14కి రిలీజ్‌ చేసేందుకుగాను.. 2023 ఆరంభంలోనే సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయ్యేలా చూసుకుంటోందట చిత్రబృందం.‘కోలమావు కోకిల’, ‘డాక్టర్‌’ సినిమాలతో అదరగొట్టిన నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ‘బీస్ట్‌’తో ఆ మ్యాజిక్‌ చేయలేకపోయాడు.

అలాంటి నెల్సన్‌.. ఇప్పుడు రజనీకాంత్‌ను ఎలా హ్యాండిల్‌ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. మొన్నీమధ్య ‘విక్రమ్‌’తో మాంచి మాస్‌ బీట్స్‌ ఇచ్చి అదరగొట్టారు అనిరుధ్‌. అలాంటి మాస్‌ బీట్‌లు ‘జైలర్‌’లోనూ ఉండాలని ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ స్క్రీన్‌ప్లే ఇస్తున్నారని సమాచారం. మరోవైపు నాలుగేళ్లుగా సరైన విజయం లేకుండా ఉన్న రజనీ.. ఈ సినిమాతో తిరిగి హిట్‌ ట్రాక్‌ ఎక్కాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #Jailer
  • #Nelson Dilipkumar
  • #Rajinikanth
  • #Ramya krishnan

Also Read

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

related news

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

trending news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

10 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

13 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

15 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

24 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

1 day ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

12 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

12 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

13 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

13 hours ago
Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version