సరైన విలన్ ఉన్నప్పుడు హీరోకు సరైన ఎలివేషన్ వస్తుంది అంటారు. మాస్ భాషలో చెప్పాలంటే విలన్ సరైనోడు అయితే హీరో అదరగొడతాడు. దీనికి రీసెంట్ ఉదాహరణ ‘జైలర్’. టైగర్ ముత్తువేల్ పాండ్యన్ అంటూ రజనీకాంత్ అంత ఎలివేషన్ వచ్చింది అంటే.. దానికి కారణం వర్మ. చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చిన వినాయకన్.. ఈ సినిమాతో స్టార్ విన్ అయిపోయాడు. యాటిట్యూడ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టేశాడు. సినిమా ఘనవిజయం సందర్భంగా ఇటీవల మీడియాతో మాట్లాడిన వినాయకన్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
సూపర్ స్టార్ రజనీకాంత్ – దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘జైలర్’. రిటైర్డ్ పోలీసు అధికారి ముత్తువేల్ పాండ్యన్‌గా రజనీకాంత్ ఈ సినిమాలో అదరగొట్టాడు. దీంతో సినిమాకు రూ. 600 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయి. విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మగా ఈ సినిమాలో వినాయకన్ నటించాడు. ‘హీరోకు తగ్గ విలన్’ అని కూడా అనిపించుకున్నాడు. సినిమా గురించి ఆయన మాట్లాడుతూ రజనీకాంత్ తనని ఎంతో ఇష్టంగా చూసుకునేవారని చెప్పాడు.
‘జైలర్’ సెట్స్‌లో వినాయకన్‌ను చూసిన ప్రతిసారి రజనీకాంత్ హగ్ చేసుకునేవారట. ఒకవేళ అతను కనిపించకపోతే ‘వినాయకన్ ఎక్కడ?’ అని అడిగి మరీ పిలిపించేవారట. అలాంటి గొప్ప వ్యక్తి గురించి అంతకుమించి నేనేం అడగగలను. ఆయన ప్రేమను ఆశీర్వాదంలా భావిస్తున్నా అని చెప్పాడు వినాయకన్. ఇక సినిమాలో వినాయకన్‌ను రజనీకాంత్ బాగా స్వేచ్ఛ ఇచ్చారట. తనకు నచ్చినట్లు నటించమని చెప్పేవారట అని వినాయకన్ చెప్పుకొచ్చాడు.
రజనీకాంత్ (Rajinikanth) తన దేవుడు అని చెప్పిన వినాయకన్… 30 ఏళ్ల నుండి తలైవాను ఫాలో అవుతున్నా అని చెప్పాడు. ‘జైలర్’ సినిమాలోకు రూ.35 లక్షలు తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై కూడా వినాయకన్ స్పందించాడు. ఎంత ఇచ్చారు అనే విషయం చెప్పను కానీ… నేను అడిగిన దాని కంటే మూడు రెట్లు ఎక్కువే ఇచ్చారని చెప్పాడు. ఆ లెక్కన బాగానే పారితోషికం ముట్టింది అని చెప్పొచ్చు. అయితే సినిమాలో కీలక వ్యక్తులకు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం రాలేదు అని తెలుస్తోంది.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!