Rajamouli: రాజమౌళికి జేమ్స్‌ కామెరూన్‌ బంపరాఫర్‌.. పెద్ద వీడియో రిలీజ్‌!

సినిమాల ప్రచారంలో రాజమౌళిని మించిన వాళ్లు లేరు అంటుంటారు. మిగిలిన ఇండస్ట్రీల విషయం మనకు తెలియకపోవచ్చు కానీ.. టాలీవుడ్‌లో మత్రం జక్కన్న ప్రచారం స్టైలే వేరు. దానికి వచ్చే స్పందనా వేరు. ‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమాను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది ఆస్కార్స్‌ కోసం ఈ సినిమా పోటీలో ఉన్న నేపథ్యంలో జక్కన్న అండ్‌ టీమ్‌ అదే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో వచ్చిన ప్రతి అవకశాన్నీ టీమ్‌ బాగానే వాడుకుంటోంది.

తొలుత చిన్న వీడియోను రిలీజ్‌ చేయడం.. ఆ తర్వాత ఎక్స్‌టెండెడ్‌ వెర్షన్‌ అంటూ ఫుల్‌ వీడియోను విడుదల చేయడం లాంటివి ఇందులో భాగమే. ఓ అవార్డు ప్రదానోత్సవం, ఆ తర్వాత ఆఫ్టర్‌ పార్టీలో భాగంగా ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌తో ఇటీవల రాజమౌళి, కీరవాణి మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్రీకరించిన వీడియోను టీమ్‌ విడుదల చేసింది. అందులో ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాను కామెరూన్‌, అతని భార్య తెగ మెచ్చుకోవడం కనిపిస్తుంది. రాజమౌళి పనితనాన్ని కూడా వాళ్లు మెచ్చుకున్నారు.

తాజాగా ఆ వీడియోకు లాంగర్‌ వెర్షన్‌ అంటూ టీమ్‌ మరో వీడియోను రిలీజ్‌ చేసింది. సుమారు నాలుగు నిమిషాలు ఉన్న ఈ వీడియోలో రాజమౌళికి కామెరూన్‌ ఇచ్చిన బంపరాఫర్‌ కూడా ఉంది. ‘‘ఎప్పుడైనా హాలీవుడ్‌లో సినిమా చేయాలనుకుంటే నన్ను సంప్రదించండి. దానిపై మాట్లాడుకుందాం’’ అని జక్కన్నకు కామెరూన్‌ చెప్పారు. దీంతో రాజమౌళి ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. కామెరూన్‌ లాంటి వ్యక్తి రాజమౌళికి సాయం చేస్తాను అన్నారు అంటే పెద్ద విషయమే అంటున్నారు. అయితే ఈ వీడియో తొలుత ఎందుకు విడుదల చేయలేదు అనేది చర్చనీయాంశం.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. గ్లోబల్‌ డైరక్టర్‌ రాజమౌళి తీసిన తొలి చిత్రం అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. ఇప్పటివరకు భారతీయ దర్శకుడిగా ఉన్న రాజమౌళి ఈ సినిమా విశ్వ దర్శకుడు అయ్యారు అంటున్నారు. అలాంటి వ్యక్తి హాలీవుడ్‌కి వెళ్తే బాగుంటుంది చాలా మంది అనుకుంటున్నారు. ఈ సమయంలో కామెరూన్‌ లాంటి వ్యక్తే ముందుకొచ్చారు అంటే హ్యాపీనే. అయితే తొలుత చిన్న వీడియో, ఇప్పుడు పెద్ద వీడియో అంటూ ఈ ముక్కల ప్రచారం ఎందుకు అనేది నెటిజన్ల ప్రశ్న.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus