కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) చివరి సినిమాగా ‘జన నాయగన్’ (Jana Nayagan) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘దళపతి 69′(వర్కింగ్ టైటిల్) తో మొదలైన ఈ సినిమాకి ‘జన నాయగన్’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్స్ వదిలారు. హెచ్ వినోద్ (H. Vinoth) ఈ సినిమాకి దర్శకుడు. ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ (Venkat K. Narayana) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రాన్ని తమిళ్ తో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇటీవల ప్రకటించారు.
దీంతో సినిమాకి క్రేజీ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి అని వినికిడి. ఆల్రెడీ ఈ సినిమాకి ఓవర్సీస్ బిజినెస్ డీల్ క్లోజ్ అయ్యింది. రూ.75 కోట్లకి అన్ని భాషల రైట్స్ అమ్ముడైపోయాయి. తాజాగా ఓటీటీ బిజినెస్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘జన నాయగన్’ సినిమాకి అన్ని భాషల్లోనూ కలుపుకుని రూ.125 కోట్లు కోట్లు ఓటీటీ బిజినెస్ అయ్యిందట. నెట్ ఫ్లిక్స్ సంస్థ అంత మొత్తం చెల్లించి హక్కులు దక్కించుకున్నట్టు సమాచారం.
‘జన నాయగన్’ సినిమాకి మొత్తంగా రూ.300 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. అప్పుడే రూ.200 కోట్లు రికవరీ కనిపిస్తుంది. ఇంకా థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ వంటివి మిగిలే ఉన్నాయి. విజయ్ సినిమాకి థియేట్రికల్ రెవెన్యూ ఎక్కువగానే వస్తుంది. ఎలా చూసుకున్నా.. నిర్మాతకి భారీ లాభాలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.