Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

తమిళ స్టార్ హీరో విజయ్ ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. తమిళనాడుకి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తమ హీరోని ఇక సినిమాల్లో చూడలేము అనే బాధ అభిమానుల్లో ఉన్నప్పటికీ.. విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్'(Jana Nayagan) ఉంది కదా అని కొంతమేర సర్దిచెప్పుకున్నారు. కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. ల్యాబ్లోనే పడుంది. ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ కావల్సిన సినిమా అది.

Jana Nayagan

కానీ ఆ సినిమాలో ఉన్న రాజకీయ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని సెన్సార్ సభ్యులు విడుదలకి నిరాకరించారు. అయితే విజయ్ సీఎం అయ్యారు కదా. ‘జన నాయగన్’ రిలీజ్ అనేది ఇక కేక్ వాక్ అని అంతా భావించారు.

కానీ ఎందుకో.. విజయ్ సీఎం అయ్యి నెల రోజులు దాటినా ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. ఈ సందిగ్ధతకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ అధినేత రంగంలోకి దిగారు. తాజా సమాచారం ప్రకారం.. సెన్సార్ క్లియరెన్స్ కోసం నిర్మాత నేరుగా ఢిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.ఈ మీటింగ్ తో ‘జన నాయగన్’ విడుదల అనేది ఓ కొలిక్కి వచ్చేస్తుంది. నెల రోజుల క్రితమే సెన్సార్ రివైజింగ్ కమిటీ ఈ సినిమాని వీక్షించింది.

ఆ కమిటీలోని ఒక సభ్యుడి నుండి కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తమవడంతో ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టారట. హీరో విజయ్ కూడా ఈ సినిమా విడుదల విషయమై ఫోకస్ పెట్టకపోవడంతో సినిమా మరింత ఆలస్యం అయ్యిందని చెప్పాలి. ఒకవేళ ఢిల్లీ చర్చలు విఫలమై, సినిమా మరింత ఆలస్యమైతే… బయ్యర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి ఎమౌంట్లు రీఫండ్ చేసే అవకాశం ఉంది.

కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus