Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

తనకున్న ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌కి, టాలెంట్‌కి, అందానికి.. వరుస సినిమా ఛాన్స్‌లు రావాలి. పెద్ద పెద్ద దర్శకులు సినిమాలు చేస్తామని అడగొచ్చు. కానీ ఏమైందో ఏమో ఆయనకు అలాంటి అవకాశాలు రాలేదు. లేక వచ్చాక ఆయన చేయలేదో తెలియదు. ఇప్పుడు స్టార్‌ లైనప్‌లో లేడు. అయితే ఖాళీగా కూడా ఏమీ లేడు. వరుసగా కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమా చేస్తూ అలరిస్తున్నారు. ఆయన నటుడు సుమంత్. ఆయన రాబోయే చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’ ప్రచారంలో భాగంగా గతంలో జరిగిన రెండు విషయాలను చెప్పుకొచ్చారు.

Sumanth

నిజాని సుమంత్‌ ఆ విషయాలను చెప్పడం ఇదే తొలిసారి కాదు. కానీ ఇప్పుడు ఆ రెండు సినిమాల గురించి ఒకేసారి చెప్పారు. అవే టాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు ‘నువ్వే కావాలి’, ‘దేశముదురు’. 2000లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘నువ్వే కావాలి’ చిత్రానికి దర్శకుడు విజయభాస్కర్ మొదట సుమంత్‌నే సంప్రదించారు. అప్పుడు ఆయన ‘యువకుడు’, ‘పెళ్లి సంబంధం’ సినిమాల్లో బిజీగా ఉండటంతో నో చెప్పారు. దీంతో ఆ సినిమా తరుణ్ హీరోగా తెరకెక్కింది. భారీ విజయమూ సాధించింది.

ఇక అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి భారీ హిట్ కొట్టిన సినిమా ‘దేశముదురు’. ఆ సినిమా స్క్రిప్ట్ కూడా ఫస్ట్ సుమంతే విన్నాడట. అయితే ఆ సినిమా చేయలేకపోయారు. ఆ సినిమా నేను చేసి ఉంటే అంత పెద్ద సక్సెస్ అయ్యేది కాదు. అల్లు అర్జున్ ఫేమ్‌, ఎనర్జీ వల్లే ఆ సినిమా భారీ విజయం సాధించింది అని ఓపెన్‌గానే బన్నీకి పొగిడేశాడు. ఇక ప్రజెంట్‌ విషయానికొస్తే.. సుమంత్‌ కీలక పాత్రలో రాజేశ్‌ కర్ణ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’. కె.హరీశ్‌ నిర్మించారు. ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయలేదు: వరుణ్‌ కామెంట్స్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus