Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 23, 2026 / 12:20 PM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ద‌ళ‌ప‌తి విజ‌య్‌ (Hero)
  • పూజా హెగ్డే (Heroine)
  • మ‌మితా బైజు, బాబీ డియోల్‌, ప్ర‌కాష్‌, సునీల్ త‌దిత‌రులు (Cast)
  • హెచ్ వినోథ్‌ (Director)
  • వెంక‌ట్ కె.నారాయ‌ణ (Producer)
  • అనిరుధ్‌ (Music)
  • స‌త్య‌న్ సూర్య‌న్‌ (Cinematography)
  • ప్ర‌దీప్‌ (Editor)
  • Release Date : 23rd జూలై 2026
  • కేవీఎన్‌ ప్రొడ‌క్ష‌న్స్ (Banner)

త‌మిళ‌నాడు సీఎం ద‌ళ‌ప‌తి విజ‌య్ (Vijay) చివ‌రి మూవీగా జ‌న‌నాయ‌గ‌న్ గురువారం త‌మిళంతో పాటు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా….మ‌మితా బైజు ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది. బాల‌కృష్ణ భ‌వంత్ కేస‌రికి రీమేక్‌గా రూపొందిన ఈ మూవీకి హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు జాన‌నాయ‌కుడుగా తెలుగులో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? చివ‌రి సినిమాతో విజ‌య్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడా? అంటే?

Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review and Rating

క‌థ‌: ద‌ళ‌ప‌తి వెట్రి కొండ‌న్ (Vijay) ఓ పోలీస్ ఆఫీస‌ర్. డీఎస్‌పీ అమ్రిష్ పుజారిని (Bobby Deol) చంపిన కేసులో జైలు పాల‌వుతాడు. ఈ కేసులో ద‌ళ‌ప‌తికి వ్య‌తిరేకంగా అత‌డి త‌ల్లి (రేవ‌తి) సాక్ష్యం చెబుతుంది. ఆ ప‌శ్చాత్తాపంతో ఆమె చ‌నిపోతుంది. త‌ల్లి చివ‌రి కోరిక‌ను నెర‌వేర్చ‌డంలో ద‌ళ‌ప‌తికి జైల‌ర్ సాయం చేస్తాడు. అత‌డి కూతురు విజ్జ‌తో (Mamitha Baiju) ద‌ళ‌ప‌తికి అనుబంధం ఏర్ప‌డుతుంది. జైల‌ర్ చ‌నిపోవ‌డంతో విజ్జీ బాగోగులు ద‌ళ‌ప‌తి చేప‌డ‌తాడు. ఆమెను ఆర్మీలో జాయిన్ చేయాల‌ని అనుకుంటాడు. కానీ విజ్జీ ఫియ‌ర్ ఫోబియాతో పాటు మ‌రికొన్ని మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంది. దాంతో ఆర్మీలో జాయిన్ కావ‌డానికి ఇష్ట‌ప‌డ‌దు.

త‌మిళ‌నాడు రాజ‌కీయ నాయ‌కుడు రోజా రంగ‌సామితో (ప్ర‌కాస్ రాజ్‌) క‌లిసి జాన్ హిమ్మ‌ర్ (బాబీ డియోల్‌) అనే గ్యాంగ్‌స్ట‌ర్‌ మ‌త‌క‌ల్లోలాల‌కు ప్లాన్ చేస్తాడు. వారి కుట్ర‌ల‌ను ద‌ళ‌ప‌తి ఎలా తిప్పికొట్టాడు? అస‌లు విజ్జీని చంపాల‌ని హిమ్మ‌ర్ మ‌నుషులు ఎందుకు అనుకున్నారు? నిజాయితీప‌రుడైన ఐపీఎస్ ఆఫీస‌ర్ అయిన ఆమ్రిష్…అవినీతి ప‌రుడిగా ఎందుకు మారాడు? ద‌ళ‌ప‌తికి వ్య‌తిరేకంగా అత‌డి త‌ల్లి ఎందుకు త‌ప్పుడు సాక్ష్యం చేసింది? దేశాన్ని కాపాడ‌టంతో ద‌ళ‌ప‌తికి క‌య‌ల్ ( పూజా హెగ్డే) ఎలా అండ‌గా నిలిచింది? ద‌ళ‌ప‌తి మంచిత‌నాన్ని విజీ అర్థం చేసుకుందా? ఆమెలోని భ‌యాలు తొల‌గిపోయాయా? అన్న‌దే జ‌న‌నాయ‌కుడు మిగ‌తా క‌థ‌.

Jana Nayakudu Movie Review and Rating

న‌టీన‌టుల ప‌నితీరు: జ‌న‌నాయ‌గ‌న్‌కు (Jana Nayakudu) విజ‌య్ న‌ట‌నే హైలైట్‌. ద‌ళ‌ప‌తి పాత్ర‌లో వీర‌తాండ‌వ‌మే చేశాడు. అత‌డి ఇమేజ్‌, స్టార్‌డ‌మ్‌ను బేస్ చేసుకొని ప్ర‌తి సీన్‌ను డిజైన్ చేసుకున్నారు డైరెక్ట‌ర్‌. యాక్ష‌న్ సీన్ల‌లో విజ‌య్ ఎలివేష‌న్లు, పొలిటిక‌ల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు క‌న్నుల పండుగ‌లా ఉన్నాయి. ఎమోష‌న‌ల్ సీన్ల‌లో విజ‌య్ న‌ట‌న మ‌న‌సుల‌ను క‌దిలిస్తుంది. పూజా హెగ్డే రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌లా క‌నిపించింది. మ‌మితా బైజు న‌ట‌న ఒకే.

ఆమెతో విజ‌య్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్లు బాగున్నాయి. క్లైమాక్స్‌లో యాక్ష‌న్‌తో అద‌ర‌గొట్టింది. స్టైలిష్ విల‌న్‌లా బాడీ డియోల్ క‌నిపించారు. విజ‌య్‌కి ధీటుగా అత‌డి విల‌నిజం సాగింది. రోజా రంగ‌స్వామిగా ప్ర‌కాష్ రాజ్‌, నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పోలీస్ ఆఫీస‌ర్‌గా సునీల్ మెప్పించారు. గౌత‌మ్ మీన‌న్‌, నాజ‌ర్, న‌రేన్‌తో పాటు చాలా మందే సీనియ‌ర్ యాక్ట‌ర్లు త‌మ ప‌రిధుల మేర ఆక‌ట్టుకున్నారు. చివ‌ర‌లో డైరెక్ట‌ర్లు అట్లీ, లోకేష్ క‌న‌గ‌రాజ్‌, నెల్స‌న్ గెస్ట్‌లుగా మెరిశారు. ఆ సీన్‌కు థియేట‌ర్ల‌లో విజిల్స్ ప‌డ‌టం ఖాయ‌మే.

Jana Nayakudu Movie Review and Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: భ‌గ‌వంత్ కేస‌రి మూల‌క‌థ‌ను తీసుకొని త‌న‌దైన స్టైల్‌లో చాలానే మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు హెచ్ వినోథ్‌. విజ‌య్ పొలిటిక‌ల్ ఇమేజ్ త‌గ్గ‌ట్లుగా సినిమా ఉంది. విజ‌య్‌ని అభిమానులు ఎలా చూడాల‌ని అనుకుంటున్నారో ఆ క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌న్నీ ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. అనిరుధ్ పాట‌ల్లో ద‌ల‌ప‌తి క‌చేరీ పాట బాగుంది. బీజీఎమ్ క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా సాగింది ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. నిర్మాత‌లు ఎక్క‌డ కాంప్ర‌మైజ్ కాలేదు. కావాల్సిన‌దానికంటే ఎక్కువే ఖ‌ర్చుపెట్టారు. సినిమాటోగ్రఫీ,ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ విభాగాలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.

Jana Nayakudu Movie Review and Rating

విశ్లేష‌ణ‌: బాల‌కృష్ణ హీరోగా న‌టించిన నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీ భగ‌వంత్ కేస‌రి ఆధారంగా జ‌న‌నాయ‌గ‌న్ మూవీ రూపొందింది. తెలుగు వెర్ష‌న్ లిమిటెడ్ బ‌డ్జెట్‌లో ఎమోష‌న‌ల్ డ్రామాగా రూపొందితే…త‌మిళ వెర్ష‌న్‌ను మాత్రం భారీ బ‌డ్జెట్‌తో యాక్ష‌న్ సినిమాలా మార్చేశారు. భ‌గ‌వంత్ కేస‌రిలోని బాల‌కృష్ణ‌, శ్రీలీల ట్రాక్‌ను జ‌న‌నాయ‌గ‌న్‌లో ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దించేశారు. విల‌న్ ట్రాక్‌ను మాత్రం పూర్తిగా కొత్త‌గా రాసుకున్నారు.ఆ స‌న్నివేశాలు విజ‌య్ రాజ‌కీయ భావ‌జాలంతో ఫ్యాన్స్‌కు విజువ‌ల్ ట్రీట్‌లా ఉన్నాయి.

సినిమాలో విజ‌య్ పాత్ర‌ పేరు…. ఆయ‌న పొలిటిక్‌ పార్టీ టీవీకేను సూచిస్తుంది. సందు దొరికిన ప్ర‌తిసారి త‌మిళ‌నాడులోని ప్ర‌తి ప‌క్ష పార్టీల‌పై సెటైర్లు వేస్తూనే వెళ్లారు విజ‌య్‌. రెండు పార్టీలు క‌లిపి ఏళ్ల‌కు ఏళ్లు ప్ర‌జ‌ల‌ను దోచుకున్నాయ‌ని, వారిని ఎదురించే ఓ శ‌క్తి రావాలంటూ విజ‌య్ రాజ‌కీయ అరంగేట్రాన్ని సూచించే డైలాగ్స్ చాలానే సినిమాలో ఉన్నాయి. అవ‌న్నీ ఫ్యాన్స్‌కు బాగా క‌నెక్ట్ అవుతాయి. అలాగ‌ని క‌థ‌ను ఎక్క‌డ ప‌క్క‌న‌పెట్ట‌లేదు.స్టోరీలో అంత‌ర్లీనంగానే వ‌చ్చేలా ఆ డైలాగ్స్‌, సీన్ల‌ను రాసుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు.

ఫ‌స్ట్ హాఫ్ ద‌ళ‌ప‌తి, విజ్జీ మ‌ధ్య అనుబంధంతో ఎమోష‌న‌ల్‌గా సాగుతుంది. సెకండాఫ్ కంప్లీట్ యాక్ష‌న్ మోడ్‌లోకి ఎంట‌ర‌య్యారు డైరెక్ట‌ర్‌. మ‌త‌క‌ల్లోలాలు, రిమోట్ గ‌న్స్‌తో దేశంలో కుట్ర‌లు చేయ‌డానికి విల‌న్ గ్యాంగ్ ప్ర‌య‌త్నాలు చేయ‌డం, వారి ఎత్తుల‌ను హీరో తిప్పికొట్టే సీన్లు గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తాయి. విల‌న్‌కు హీరోకు మ‌ధ్య ఓ సంబంధం ఉన్న‌ట్లుగా చూపిస్తూ ఫ్యాష్‌బ్యాక్‌లోకి ఎంట‌ర‌య్యారు. ఆ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ రా అండ్ ర‌స్టిక్‌గా సాగింది. ప్ర‌కాష్ రాజ్ ప్యాలెస్‌లోకి విజ‌య్ ఎంట‌రై అత‌డితో ఫైట్ చేసే సీన్ థ్రిల్లింగ్ ఉంది. క్లైమాక్స్ యాక్ష‌న్ ఎపిసోడ్ రోబోల‌తో హాలీవుడ్ సినిమాల లెవెల్‌లో సాగింది. విల‌న్ ట్రాక్ పెడిక్ట‌బుల్‌గా సాగ‌డం మైన‌స్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ రోబోలో ఫైట్ కూడా ఆక‌ట్టుకోదు.

సినిమాకు బిగ్గెస్ట్ మైన‌స్ లెంగ్త్‌. మూడు గంట‌ల మూడు నిమిషాల ర‌న్‌టైమ్ ఎక్కువే అనిపిస్తుంది. భ‌గ‌వంత్ కేస‌రి చూసిన వాళ్ల‌కు కూడా జ‌న‌నాయ‌గ‌న్ కొత్త‌గా అనిపిస్తుంది. క‌థా ప‌రంగా సినిమాలో కొన్ని లోపాలు ఉన్నా విజ‌య్ త‌నదైన స్టైల్ యాక్టింగ్‌, మ్యాన‌రిజ‌మ్స్‌తో చాలా వ‌ర‌కు వాటిని క‌వ‌ర్ చేశారు.

Jana Nayakudu Movie Review and Rating

ఫోక‌స్ పాయింట్‌: జ‌న‌నాయ‌కుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ వ‌న్ మెన్ షోగా నిలుస్తుంది. ద‌ళ‌ప‌తి ఫ్యాన్స్‌కు ఫేర్‌వెల్‌ ట్రీట్‌లా ఈ సినిమా ఉంటుంది.

రేటింగ్: 2.75/5

Click Here To Read in ENGLISH

Rating

2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anirudh
  • #Bobby Deol
  • #Jana Nayagan movie
  • #Jana Nayakudu Movie
  • #Mamitha Baiju

Reviews

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

2 days ago
OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

2 days ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

2 days ago
Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

2 days ago
వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

2 days ago

latest news

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

2 days ago
OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

3 days ago
Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఆకాశంలో ఒక తార’ వసూళ్లు

Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఆకాశంలో ఒక తార’ వసూళ్లు

3 days ago
ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

3 days ago
Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version