Janaka Aithe Ganaka Trailer Review: ‘జనక అయితే గనక’ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్.. ట్రైలర్ ఎలా ఉందంటే..?

సుకుమార్ (Sukumar) చెప్పినట్టు నిజంగానే సుహాస్ (Suhas) ‘ఫ్యూచర్ నాని’ అయిపోయేలా ఉన్నాడు. వరుసగా డిఫరెంట్ కాన్సెప్ట్..లతో సినిమాలు చేయడమే కాకుండా.. అన్నీ కూడా కమర్షియల్ గా సక్సెస్ అయ్యేలా చూసుకుంటున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ‘అంబాజీపేట మ్యారేజీబ్యాండు’ (Ambajipeta Marriage Band) సినిమాతో అతను ఓ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) కూడా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కానీ రాంగ్ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల కాబోలు.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది.

Janaka Aithe Ganaka Trailer

అయితే అతని అప్ కమింగ్ మూవీ ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది.సెప్టెంబర్ 7 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ట్రైలర్ ని కూడా వదిలారు. 2 : 08 నిమిషాల నిడివి కలిగిన ‘జనక అయితే గనక’ ట్రైలర్.. కంప్లీట్ గా కామెడీతో నిండి ఉంది.

ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన, అందులోనూ వాషింగ్ మిషన్ సేల్స్ మెన్ గా పనిచేసే హీరో పిల్లలను కనడం అనేది కోట్లతో కూడుకున్న వ్యవహారంగా భావిస్తాడు. వాళ్ళ చదువులు వంటివి మొత్తం లెక్కలేసుకుని.. అది బాధ్యతగా కాకుండా, బరువుగా భావించి అతను పిల్లల్ని కనకూడదు అని ఫిక్స్ అవుతాడు.

ఈ క్రమంలో సేఫ్టీ వాడినప్పటికీ.. అతను తండ్రవుతాడు. దీంతో సదరు కండో* సంస్థ పై కేసు వేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అనే సస్పెన్స్ ని రేకెత్తిస్తూ ట్రైలర్ ని కట్ చేశారు. ఇది అందరినీ ఆకట్టుకునే విధంగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

దేవర బెనిఫిట్ షో చూడాలంటే ఫ్యాన్స్ ఆ రేంజ్ లో ఖర్చు చేయాలా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus