జానపద కథను సిద్ధం చేసిన విజయేంద్ర ప్రసాద్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ అందుకుంది. వీరి కలయికలో వచ్చిన స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  రాజమౌళి బాహుబలి చిత్రీకరణలో మూడేళ్లుగా నిమగ్నం కావడం ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు వీలుకుదరలేదు. బాహుబలి కంక్లూజన్ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఆయన తర్వాతి సినిమాపై వార్త బయటికి వచ్చింది.

తారక్ తో ఓ జానపద సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జోరుగా నడుస్తుందని తెలిసింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ వక్కంతు వంశీ చెప్పిన కథను సైతం పక్కన పెట్టారని టాక్. జనతా గ్యారేజ్ విజయానందంలో ఉన్న ఎన్టీఆర్ కొన్ని రోజుల పాటు విదేశాల్లో విహారానికి వెళ్లి వచ్చిన తర్వాత తన కొత్త సినిమా విశేషాలను వెల్లడిస్తారని అయన సన్నిహితులు వెల్లడించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus