ఒకరోజు ముందుగానే జనతా గ్యారేజ్.!

తారక్ అభిమానులకు శుభవార్త. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “జనతా గ్యారేజ్” మూవీ ప్రీపోన్డ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ వారు 50 కోట్లతో నిర్మించిన ఈ సినిమాను తొలుత  సెప్టెంబర్ 2 న రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఆరోజు కార్మికులు దేశవ్యాప్తంగా బంద్ ప్రకటించిన కారణంగా సినిమాను ఒక రోజు ముందుగానే రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.

సెప్టెంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో జనతా గ్యారేజ్ సందడి చేయనుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ లో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాజల్ ప్రత్యేక గీతంలో అందాలు ఆరబోయనుంది. రెండు రోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 26 న సెన్సార్ కు జనతా గ్యారేజ్ సినిమాను పంపించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus