దిమ్మతిరిగిపోయే రేట్!!!

టాలీవుడ్ ను శాసిస్తున్న హీరోల్లో నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ యంగ్ టైగర్ తాజా చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకులముందుకు రానుంది. అదే క్రమంలో ఈ సినిమాపై రోజు రోజుకీ అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతూ ఉండడంతో ఈసీనిమా కొనుగోళ్లు సైతం తారా స్తాయికి చేరుకున్నాయి. ఇప్పటివరకూ టాలీవుడ్ నే శాసిస్తున్న ఎన్టీఆర్, ఇప్పుడు కేరళలో కూడా తన పాగా వెయ్యాలి అన్న ఆలోచనతో అక్కడ సూపర్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటున్న మోహన్ లాల్ ను తన సినిమాలో ఒక కీలక పాత్రలో పెట్టుకున్నాడు.

ఇక మోహన్ లాల్ ఆధారంగా ఎన్టీఆర్ కేరళలో చక్రం తిప్పేందుకు వ్యూహాలు పన్నుతున్నాడు. అందులో భాగంగానే ఇప్పటివరకూ అల్లు అర్జున్ మినహా, మిగిలిన తెలుగు హీరోలు ఎవ్వరూ కేరళ తమ సత్తా చూపించింది లేదు…ఒక్క అల్లు అర్జున్ సినిమా…”సరైనోడు”  అక్కడ ”యోధావు” అని రిలీజ్ చేస్తే.. 7 కోట్ల ధియేట్రికల్ కలక్షన్ వచ్చింది. అంటే నిర్మాత చేతికి వచ్చింది కేవలం 3.4+ కోట్ల షేర్ అనమాట. ఇక దాన్ని బీట్ చేస్తూ బిజినెస్ చేస్తుంది మన జనతా గ్యారేజ్.

ఇంతకీ ఈ సినిమాకు అక్కడ ఎంత రేట్ ఉందో తెలుసా…అయితే ఈ లెక్కలు చూడండి…”జనతా గ్యారేజ్” సినిమాకు ఇలాంటి లెక్కలతో సంబంధం లేకుండా.. ఏకంగా 7 కోట్లు పెట్టి రైట్స్ కొనుగోలు చేశారట. అంటే షుమారు 14 కోట్లు వస్తే కాని సినిమాపై పెట్టిన ఇన్వెస్టుమెంటును అక్కడి పంపిణీదారులు రికవర్ చేసుకోలేరు. మరి ఒక పక్క ఎన్టీఆర్ స్టామినా, మరో పక్క మోహన్ లాల్ ఉన్నాడు అంటే భరోసా వెరసి…జనతా గ్యారేజ్ దుమ్ము దులిపేస్తుంది అంటున్నారు అభిమానులు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus