జనతా గ్యారేజ్ టైటిల్ కి “ఇచట అన్ని రకాల రిపేర్లు చేయబడును” అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత “ఇచట అన్ని రకాల రికార్డులకు రిపేర్లు చేయబడును” అనే విధంగా మారిపోయింది. ఈ సినిమా ద్వారా డైరక్టర్ కొరటాల శివ, హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తారక్ కెరీర్ లో అత్యధిక కలక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ వారు 50 కోట్లతో నిర్మించిన గ్యారేజ్ 135 కోట్ల గ్రాస్ ని రాబట్టి రికార్డు సృష్టించింది.
సెప్టెంబర్ 1 విడుదలైన ఈ మూవీ నేటి(అక్టోబర్ 20)తో 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ డైరక్టర్ కొరటాల శివకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా “జనతా గ్యారేజ్ విజయానికి తోడ్పడిన తోటి నటులు, టెక్నీకల్ సిబ్బంది, అభిమానులు, ప్రేక్షకులు, మీడియా మిత్రుల మేలు మరిచి పోలేను” అని తారక్ ట్విట్టర్లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
And 50 it is!thanks one and all for this phenomenal and memorable success.
— tarakaram n (@tarak9999) October 20, 2016
And 50 it is!thanks one and all for this phenomenal and memorable success.
— tarakaram n (@tarak9999) October 20, 2016
And not to forget the support given by the cast and crew on janatha garage,fans,audience,media,and our well wishers.thanks!
— tarakaram n (@tarak9999) October 20, 2016