Janhvi Kapoor: తల్లితో సరదా సంఘటనను గుర్తు చేసుకున్న జాన్వీ… ఏం చెప్పిందంటే?

తెలుగు వాళ్లు ఎంత ఇతర భాషల్లో అనర్గళంగా మాట్లాడినా… కోపం వచ్చినప్పుడు మాత్రం మాతృభాషలోకి వచ్చేస్తారు. ఆ మాటకొస్తే ఏ భాష వాళ్లు అయినా ఇలానే చేస్తారు. దీనికి సెలబ్రిటీలు కూడా అతీతం కాదు. తాజాగా ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేసింది జాన్వీ కపూర్‌. తన తల్లి శ్రీదేవి దగ్గర అల్లరి చేస్తే ఆమె ఎలా రియాక్ట్‌ అయ్యేదో ఓ ఇంటర్వ్యూలో వివరించింది. దీంతో ఆ మాటలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

శ్రీదేవి తనయగా సినిమాల్లోకి వచ్చింది జాన్వీ కపూర్‌. అయితే ఎక్కడా తల్లి పేరును ఉపయోగించుకోలేదు. సినిమా కథల ఎంపిక విషయంలో కూడా ఆమెనే స్వతంత్రంగా వ్యవహరించింది. అయితే ఇప్పుడు ఆ విషయంలో కాస్త రిగ్రెట్‌ ఫీల్‌ అవుతోంది. తన తల్లి ముందుకొచ్చినా నేను అప్పుడు సాయం తీసుకోలేదు, తీసుకోవాల్సింది అంటూ ఆ మధ్య ఓసారి మాట్లాడింది. ఇలా శ్రీదేవి గురించి జాన్వీ ఏం చెప్పినా వైరల్‌ అవుతూనే ఉంది.

అలా ఓ ఇంటర్వ్యూలో తన తల్లితో చేసిన అల్లరి, అప్పుడు శ్రీదేవి రియాక్షన్‌ గురించి మాట్లాడింది జాన్వీ. చిన్నతనంలో అమ్మ గదికి వెళ్లి వార్డ్‌ రోబ్‌ దగ్గర ఉన్న లిప్‌స్టిక్‌లు దొంగతనంగా తీసేసి పాకెట్‌లో పెట్టేసుకునేదాన్ని. అప్పుడు అమ్మ నన్ను పట్టుకుని తిట్టేది అంటూ… అని చెప్పింది. శ్రీదేవి ఏమని తిట్టేదో తెలుసా మనం మామూలుగా తిట్టుకునే పదం ఉంటుంది కదా ‘నా కొడకా’ అని. ఆ మాటతోనే తిట్టేదట శ్రీదేవి.

ఆ పదం కాస్త ఇబ్బందికరం అయిందైనా… శ్రీదేవి – జాన్వీ (Janhvi Kapoor) మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పేలా ఉండటంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అందమైన అమ్మాయి ఏమన్నా ముద్దుగానే ఉంటుంది అని అంటుంటారు. మరోసారి ఈ వీడియోవ వైరల్‌ అవ్వడంతో ఆ విషయం నిజమని మరోసారి నిరూపితమైంది. ఇక జాన్వీ సినిమాల సంగతి చూస్తే… చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నా ఆమె సౌత్‌ ఎంట్రీ ‘దేవర’తో త్వరలో జరగబోతోంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయట.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus