Janhvi Kapoor: ఆ పాత్రలలో నటించే ఛాన్స్ లేదంటున్న జాన్వీ కపూర్.. ఏం చెప్పారంటే?

దేవర ‘(Devara) మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో ప్రదర్శితం కావడంతో పాటు ఇప్పటికే 80 శాతానికి పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దేవర సినిమా సాధించిన కలెక్షన్ల విషయంలో ఈ సినిమా నిర్మాతలు సైతం సంతృప్తితో ఉన్నారని సమాచారం అందుతోంది. అయితే జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తాజాగా అమ్మకు ఇచ్చిన మాట జవదాటనంటూ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏ సినిమాలో అయినా జుట్టు లేకుండా నటించే రోల్ లో నటించే పరిస్థితి ఉంటే తాను నటించబోనని ఆమె తెలిపారు.

Janhvi Kapoor

అలాంటి రోల్స్ కు నేను వ్యతిరేకం అని ఆమె చెప్పుకొచ్చారు. నా జుట్టు కట్ చేసుకోవడానికి నేను ఇష్టపడనని పాత్ర కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా నేను సిద్ధమని తెలిపారు. దఢక్ సినిమా కోసం జుట్టు కట్ చేసుకుంటే అమ్మ సీరియస్ అయిందని ఆమె చెప్పుకొచ్చారు. అమ్మ జుట్టు కట్ చేసుకోవద్దని చెప్పిన నేపథ్యంలో అమ్మ మాటను నేను వింటానని ఆమె పేర్కొన్నారు.

పాత్రల కోసం జుట్టు కట్ చేసుకోవాల్సి వస్తే నన్ను సంప్రదించవద్దని ఆమె చెప్పకనే చెప్పేశారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం చరణ్  (Ram Charan) బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబో మూవీలో కీ రోల్ లో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమా కోసం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు. దేవర సినిమా జాన్వీ కపూర్ కు ప్లస్ కాకపోయినా తర్వాత ప్రాజెక్ట్ లతో జాన్వీ కచ్చితంగా సత్తా చాటుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

దేవర సినిమాకు యాక్షన్ సన్నివేశాలు మాత్రం హైలెట్ గా నిలిచాయి. దేవర, భైరా కాంబినేషన్ సీన్స్ హైలెట్ గా నిలిచాయి. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతో అదరగొట్టిన దేవర రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

మా బిల్డింగ్ గురించి మంచు విష్ణు క్లారిటీ ఇదే.. ప్రకటన ఎప్పుడంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus