Janhvi Kapoor: ‘#RC16’ .. విషయంలో హీరోయిన్ రూమర్స్ నిజమేనా..?!

రాంచరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ ఇది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అయితే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 3 ఏళ్ళు దాటినా ఇప్పటికీ.. ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం సాధ్యమైనంత తొందరగా ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేసి..

నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలి అని హీరో రాంచరణ్ భావిస్తున్నాడు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు చరణ్. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలా కాలంగా ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరు అనే దాని పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కనిపించబోతుంది అంటూ కథనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘ఆర్.సి.16 ‘ కోసం జాన్వీ కపూర్ ఇప్పటికే లుక్ టెస్ట్ లో పాల్గొందట. ‘దేవర’ కంటే ముందే ఈ ప్రాజెక్టు కోసం చిత్ర బృందం లుక్ టెస్ట్ చేసినట్టు వినికిడి. కానీ చిత్ర బృందం మాత్రం ఆమెను ఇంకా ఫైనల్ చేయలేదు అని చెబుతుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది అని చెప్పాలి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus