శ్రీదేవి కూతురి టాలీవుడ్ ఎంట్రీ ఎన్టీఆర్ సినిమాతోనే…!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అయిన జాన్వీ కపూర్‌ టాలీవుడ్ కు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది అని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. మన తెలుగు ప్రేక్షకులు కూడా ఆమె ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో హీరోయిన్ గా జాన్వీకపూర్‌ దాదాపు ఫిక్స్ అయిపోయినట్టే అని తెలుస్తుంది. మొన్నటి వరకూ పూజా హెగ్డేనే హీరోయిన్ అంటూ ప్రచారం జరిగినప్పటికీ..

ఎన్టీఆర్ సరసన ఓ కొత్త హీరోయిన్ అయితేనే బాగుంటుందంటూ త్రివిక్రమ్‌ భావిస్తున్నాడట. దాంతో జాన్వీకపూర్‌ నే ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని టాక్ బలంగా వినిపిస్తుంది. స్క్రిప్ట్‌ కూడా దాదాపు పూర్తయిపోయింది.ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం. చెప్పాలంటే పూరి-విజయ్‌ దేవరకొండ కాంబినేషన్లో రాబోతున్న ‘ఫైటర్‌’(వర్కింగ్ టైటిల్) లోనే జాన్వీని హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అనన్య పాండేను ఫైనల్ చేశారని సమాచారం.

ఏదైతేనేం ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే జాన్వీ కపూర్ కు కూడా ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడుతుంది అనడంలో సందేహం లేదు. ఇక జాన్వీ కపూర్ నటించిన మొదటి చిత్రం ‘దఢక్’ ఓ మోస్తరుగా ఆడినప్పటికీ, జాన్వీ పెర్ఫార్మన్స్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక రెండో చిత్రం ‘గుంజన్ సక్సేనా’.. ఇటీవల ఓటిటిలో విడుదలవ్వగా దానికి కూడా మంచి స్పందనే లభించింది.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus