Janhvi Kapoor: ‘చుట్టమల్లె’ గురించి ఇక్కడ జరుగుతోంది ఒకటి.. ఆమె మరొకటి.!

బాలీవుడ్‌లో ట్రోలింగ్‌ ఎక్కడుంటుంది అంటే.. జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)  చుట్టూ ఉంటుంది అని చెప్పొచ్చు. ఆమె ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏ సినిమా చేసినా, ఆమె సినిమా నుండి ఏ పాట వచ్చినా, ట్రైలర్‌ రిలీజ్‌ చేసినా.. ఏదో ఒక పాయింట్‌ పట్టుకుని ఆడుకోవడానికి ట్రోలర్లు రెడీగా ఉంటారు. దాంతో ఆమెకు ఈ మధ్య కాలంలో ట్రోలింగ్‌ బాగా అలవాటు అయిపోయింది అని చెప్పాలి. అయితే రీసెంట్‌గా ఆమె నుండి వచ్చిన ఓ సాంగ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదట. ఏమైదంటే?

Janhvi Kapoor

‘చుట్టమల్లె..’ అంటూ ‘దేవర’ (Devara) సినిమా నుండి ఇటీవల ఓ పాట రిలీజ్‌ చేశారు గుర్తుందా? ఆ పాటకు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వస్తూనే ఉన్నాయి. సినిమా టీమ్‌ పూటకో పోస్టర్‌ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే పరిస్థితి అర్థం చేసుకొవచ్చు. అంత హిట్‌ అయిన పాట తనకు ఎలాంటి ట్రోలింగ్‌ ఇబ్బందిని తీసుకురాలేదని జాన్వీ చెప్పింది. అయితే ఆమెకు సౌత్‌లో వస్తున్న ట్రోలింగ్‌ గురించి తెలియదేమో అనే కామెంట్లు కూడా వినిపిస్తోంది.

‘చుట్టమల్లే..’ పాటకు వస్తోన్న స్పందన చూసి ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన జాన్వీ.. పాట విషయంలో తనపై నెగెటివ్‌ ట్రోల్స్‌ రాలేదని ఆనందం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని కూడా చెప్పింది. డ్యాన్స్‌, ఎన్టీఆర్‌తో కెమిస్ట్రీ అందరికీ నచ్చిందని చెప్పిన ఆమె.. పాటకు సోషల్‌ మీడియాలో వస్తున్న రీల్స్‌ చూస్తే ఆనందంగా ఉందని చెప్పింది.

అయితే, ఈ పాటకు ఓ హిట్‌ సాంగ్‌ను ఇన్‌స్పైర్‌ అయి చేసిన పాట అంటూ తొలి రోజుల్లోనే విషయం బయటకు వచ్చింది. దీంతో అనిరుథ్‌ (Anirudh Ravichander)  విషయంలో చాలా ట్రోల్స్‌ వచ్చాయి. అయితే తారక్‌ (Jr NTR) లుక్ విషయంలో.. జాన్వీ గ్లామర్‌ విషయంలో ఎక్కడా ఎలాంటి ట్రోల్స్‌ రాలేదు. ఆ లెక్కన ఆమెకు ఇది మంచి పాటే. కానీ ఒక్క అనిరుథ్‌ విషయంలోనే ఈ పాట కాస్త చేదు అందించింది.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఆ రేంజ్ లో ఉండబోతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus