Janhvi Kapoor: వారిద్దరూ నా బలం.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన జాన్వీ!

స్టార్ కిడ్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు దివంగత నటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. ఈమె ధడక్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా జాన్వీ కపూర్ తన అన్నయ్య అర్జున్ కపూర్ గురించి హార్ట్ టచింగ్ ఎమోషనల్ కామెంట్ చేశారు. రక్షాబంధన్ సందర్భంగా ఈమె తన అన్నయ్యతో తనకున్న రిలేషన్ గురించి బయట పెట్టారు.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ మొదటి భార్య శౌరి కపూర్ పిల్లలే అన్షుల్లా కపూర్, అర్జున్ కపూర్, రెండవ భార్య శ్రీదేవి కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్.అయితే మొదట్లో వీరి మధ్య పెద్దగా ఎలాంటి అనుబంధాలు లేవని చెప్పాలి. కానీ ప్రస్తుతం వీరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఏర్పడిందని అన్నాచెల్లెళ్లుగా వీరి మధ్య మంచి బంధం ఉందని తాజాగా జాన్వీ కపూర్ తన సోదరుడు అర్జున్ కపూర్ గురించి వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మొదటిసారిగా తన అన్నయ్యకు రక్షాబంధన్ కట్టిన సందర్భాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని, అదొక మధురమైన ప్రత్యేక క్షణం అంటూ జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు. ఇకపోతే అన్షుల్లా కపూర్, అర్జున్ కపూర్ తో తన బంధం మరింత బలపడిందని వారిద్దరూ నా బలం అంటూ ఈమె హార్ట్ టచింగ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఇలా మేమందరం కలిసి ఎంతో సంతోషంగా ఒకే కుటుంబంలో ఉండాలనేదే తన కోరిక అని అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తాను రక్షాబంధన్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నానని. ఎక్కడ ఉన్నా ఎంత బిజీగా ఉన్నా తాను ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటానని ఈ సందర్భంగా అర్జున్ కపూర్ తో తనకున్న రిలేషన్ పై జాన్వీ కపూర్ స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus