రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ కాగా త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమేనని బోనీ కపూర్ నుంచి క్లారిటీ వచ్చేసింది. ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ చరణ్ జాన్వీ కాంబినేషన్ లో సినిమా రానుందని వెల్లడించారు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
జాన్వీ కపూర్ ఇప్పటివరకు బాలీవుడ్ లో నటించిన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం దేవర సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుండగా ఈ సినిమా విడుదలైతే మాత్రమే ఆమె యాక్టింగ్ టాలెంట్ గురించి తెలుగు ప్రేక్షకులకు అవగాహన వచ్చే అవకాశం అయితే ఉంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీలో ఆమె పల్లెటూరి యువతి పాత్రలో కనిపించాల్సి ఉంటుంది.
ఎక్కువగా క్లాస్ రోల్స్ లో నటించిన జాన్వీ కపూర్ పల్లెటూరి యువతి పాత్రకు ఎంత మాత్రం సూట్ అవుతారో కచ్చితంగా చెప్పలేము. అందువల్ల హీరోయిన్ విషయంలో రిస్క్ చేయడం రైట్ కాదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నెటిజన్ల కామెంట్లను మేకర్స్ పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
చరణ్ (Ram Charan) బుచ్చిబాబు కాంబో మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో 250 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చరణ్ యాస, లుక్ కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా బయోపిక్ అని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని మేకర్స్ చెబుతున్నారు. చరణ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.
భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!