Jani Master: లైంగిక దాడి ఆరోపణల వ్యవహారం.. జానీ మాస్టర్‌ అవార్డు..!

  • October 6, 2024 / 07:01 PM IST

జానీ మాస్టర్‌ – మహిళా కొరియోగ్రాఫర్‌ వ్యవహారం ఎక్కడివరకు, ఎక్కడ ముగుస్తుంది అనే విషయంలో అప్పుడే ఓ స్పష్టతకు రాలేము కానీ.. ఇప్పుడు అయితే జానీ మాస్టర్‌ కెరీర్‌లో ఎవరూ ఊహించని, ఎవరూ కోరుకోని దెబ్బ తగిలింది. ఇండస్ట్రీలోకి అందరూ కష్టాలు ఎదుర్కొనే వస్తారు. అలా వచ్చినవాళ్లకు రెమ్యూనరేషన్‌తోపాటు పురస్కారం ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి ఓ కీలక పురస్కారం ఇప్పుడు ఆయనకు రాకుండా హోల్డ్‌లో పడిపోయింది. అవును, షేక్‌ జానీ బాషా అలియాస్‌ జానీ మాస్టర్‌కు ఇటీవల జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా పురస్కారం అనౌన్స్‌ చేశారు.

Jani Master

తమిళ చిత్రం ‘తిరు’లో ఆయన కంపోజ్‌ చేసిన డ్యాన్స్‌కుగాను ఆ అవార్డు అందుకోవాల్సి ఉంది. దీని కోసమే ఆయన బెయిల్‌ మీద బయటకు వచ్చారు కూడా. అయితే ఇప్పుడు ఆ పురస్కారాన్ని హోల్డ్‌లో పెట్టారు. జానీకి ప్రకటించిన జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు సెల్‌ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది. 2022 సంవత్సరానికిగాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ ఎంపికయ్యారని, ఈ నెల 8న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో పురస్కారం అందుకోవాల్సి ఉందని, అయితే తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ నృత్యదర్శకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జానీ మాస్టర్‌ మీద పోక్సో కేసు నమోదు కావడంతో అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ అభియోగాల నేపథ్యంలో అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, ఆహ్వాన పత్రికను రద్దు చేస్తున్నట్లు అవార్డుల సెల్‌ ప్రకటనలో పేర్కొంది. దీంతో కేసు విషయం తేలేంతవరకు జానీ మాస్టర్‌ ఆ పురస్కారాన్ని అందుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ఆరోపణలు నిజమైతే.. అవార్డు రద్దు చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

ఇక ఇదే పురస్కార కార్యక్రమానికి వెళ్లడానికి జానీ మాస్టర్‌కు న్యాయస్థానం అక్టోబరు 6 నుండి 9 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఇప్పుడు ఆ బెయిల్‌ మీదనే ఆయన బయట ఉన్నారు. అవార్డు హోల్డ్‌లో పడిన కారణంగా ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

గోపీచంద్ మనసులో మాట.. ఐడియా బాగానే ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus