Gopichand: గోపీచంద్ మనసులో మాట.. ఐడియా బాగానే ఉంది..!

గోపీచంద్ హీరోగా కెరీర్ ని స్టార్ట్ చేశాడు. కానీ బ్రేక్ వచ్చింది విలన్ గా..! ‘జయం’ ‘నిజం’ ‘వర్షం’ వంటి సినిమాల్లో గోపీచంద్ విలన్ గా చేశాడు. ఆ సినిమాల్లో హీరోల కంటే ఎక్కువ మార్కులు విలన్ గా చేసిన గోపీచంద్ కే పడ్డాయి. మాస్ ఆడియన్స్ కి ఆ సినిమాలు గోపీచంద్ ను బాగా దగ్గర చేశాయి. ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే మళ్ళీ ‘యజ్ఞం’ తో హీరోగా మారాడు. ఆ తర్వాత చేసిన ‘రణం’ ‘లక్ష్యం’ ‘శౌర్యం’ వంటి సినిమాలు బాగా ఆడాయి. అతనికి మంచి మార్కెట్ ఏర్పడింది.

Gopichand

మాస్ హీరోగా నిలదొక్కుకుంటున్న టైంలో వరుస ప్లాపులు ఎదురయ్యాయి. దీంతో అతని మార్కెట్ దెబ్బతింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. మినిమమ్ మార్కెట్ ఉన్న హీరోగా చలామణి అవుతున్నప్పటికీ.. గోపీచంద్ పారితోషికం రూ.3 కోట్ల దగ్గరే ఆగిపోయింది. వాస్తవానికి అతని మార్కెట్ రూ.30 కోట్ల వరకు ఉన్నప్పటికీ.. మాస్ అండ్ యాక్షన్ మూవీస్ మాత్రమే చేయాలి కాబట్టి.. గోపీచంద్ సినిమాలకి రూ.50 కోట్ల వరకు బడ్జెట్లు పెట్టాల్సి వస్తుంది.

సో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వరుసగా రూపొందుతున్నాయి. ఇలాంటి టైంలో గోపి విలన్ గా చేసి మిగతా భాషల్లో కూడా పాపులారిటీ సంపాదించుకుంటే.. మార్కెట్ పెరుగుతుంది. కానీ గోపీచంద్ మాత్రం.. ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ‘విలన్ గా చేయాల్సి వస్తే.. ప్రభాస్ సినిమాలో మాత్రమే చేస్తాను. మిగతా హీరోల సినిమాల్లో విలన్ గ చేయడం ఇష్టం లేదు’ అని తెగేసి చెప్పేశాడు. ‘విశ్వం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గోపి ఇలా చెప్పుకొచ్చాడు.

ఒక రకంగా ఇది సరైన స్టేట్మెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు విలన్ గా మారి మిగతా హీరోల సినిమాల్లో చేస్తే.. ఎంతవరకు సక్సెస్ వస్తుంది అనేది చెప్పలేం. అదే ప్రభాస్ సినిమాలో కనుక విలన్ రోల్ చేస్తే దేశవిదేశాల్లో కూడా గుర్తింపు లభిస్తుంది. గోపీచంద్ కటౌట్ కి పక్క భాషల నుండి కూడా ఆఫర్లు లభిస్తాయి.

ఓజీ రిజల్ట్ పై థమన్ కామెంట్స్ వైరల్.. నమ్మకం నిజమవుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus