జెట్ స్పీడ్‌లో వెళ్తున్న జానీ మాస్టర్ (Jani Master) కెరీర్‌కు ఇప్పుడు ఊహించని బ్రేక్ పడింది. తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన అమ్మాయి ఆరోపణలు, తర్వాత పరిణామాల నేపథ్యంలో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి.. ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నారు. అలా వచ్చినప్పటి నుండి తిరిగి సినిమాల్లోకి వచ్చి, బిజీ అవ్వాలని చూశారు. కానీ ఆయనకు ఛాన్స్‌లు రాలేదు. అయితే రీసెంట్‌గా ఓ కన్నడ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.
దీంతో తెలుగులో జానీ మాస్టర్ ఎప్పుడొస్తారు? ఎవరితో రీఎంట్రీలో తొలి సినిమా చేస్తారు అంటూ చర్చ జరుగుతూ ఉంది. ఇంకా సినిమా ఏదీ అనౌన్స్ కాకపోవడం, ఆయన కూడా ఇక్కడ ఏ సినిమాకూ పని చేయకపోవడం ప్రశ్నలు లేవనెత్తింది. తాజాగా ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. జానీ మాస్టర్ తనకు ఎంతో సాయం చేసిన, ఆయన నమ్మిన మెగా కాంపౌండ్ నుండే సెకండ్ ఎంట్రీ తొలి అవకాశం వచ్చింది.
తన సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) మామూలుగా ప్రతి సినిమాలో జానీ మాస్టర్‌తో ఒక సాంగ్ చేయించుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్లుగా ఈ స్టైల్ మనం చూస్తూనే ఉన్నాం. అలా ఇప్పుడు కూడా బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు. బుచ్చిబాబు పుట్టిన రోజు సందర్భంగా జానీ మాస్టర్ విషెస్ చెబుతూ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. అందులో మీతో కలసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని రాసుకొచ్చారు.
ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. క్రికెట్ స్టేడియం సెట్‌లో సినిమా కోసం రాత్రి, పగలు చిత్రీకరణ చేస్తున్నారు. అయితే ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగే సినిమా అని పుకార్లు వచ్చాయి. కానీ ఈ సినిమా నేపథ్యానికి క్రికెట్‌తో సంబంధం లేదు అని టీమ్ చెబుతోంది. అన్నట్లుగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా ఫలితం ఎలా ఉన్నా.. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాట ‘దోప్’కు మంచి స్పందనే వచ్చింది.