కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ 25వ సినిమాగా ‘జపాన్’ రూపొందింది. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ అధినేతలైన ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు.. లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. సునీల్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. కానీ నవంబర్ 10న రిలీజ్ అయిన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది.
మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కానీ.. టాక్ ఎఫెక్ట్ వల్ల రెండో రోజు నుండి కలెక్షన్స్ తగ్గాయి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.11 cr |
సీడెడ్ | 0.28 cr |
ఉత్తరాంధ్ర | 0.31 cr |
ఈస్ట్+వెస్ట్ | 0.28 cr |
కృష్ణా + గుంటూరు | 0.30 cr |
నెల్లూరు | 0.21 cr |
ఏపి+ తెలంగాణ | 2.49 cr |
‘జపాన్’ (Japan) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.49 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.3.81 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆ టార్గెట్ ను రీచ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు.ఫైనల్ గా ఎంత వరకు రాబడుతుందో చూడాలి
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!