జపనీయుల కానుకలను చూసి ఆశ్చర్యపోతున్న రాజమౌళి.!

తన ఆలోచన, టేకింగ్ తో సినీ అభిమానులను షాక్ కి గురి చేసే రాజమౌళి.. ప్రస్తుతం ఆశ్చర్యంలో మునిగిపోయి ఉన్నారు. అంతేకాదు జపనీయులు కురిపించిన ప్రేమానురాగాల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. అసలు విషయంలోకి వెళితే… బాహుబలి కంక్లూజన్ రీసెంట్ గా జపాన్ లోను వందరోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత శోభుయార్లగడ్డతో కలిసి జపాన్ కి వెళ్లారు. అక్కడ శతదినోత్సవవేడుకలో పాల్గొన్నారు. ఆ ఫోటోలను ఇదివరకే షేర్ చేసుకున్నారు కూడా. అయితే జపనీయులు రాజమౌళిని వట్టి చేతులతో ఇంటికి పంపించలేదు. అనేక కానుకలను ఇచ్చారు. హైదరాబాద్ కి వచ్చినప్పటికీ బిజీగా ఉండడం వల్ల జక్కన్న ఆ గిఫ్ట్స్ ఏమిటో ఇప్పటివరకు తెరిచి చూడలేదు. ఈరోజు ఓపెన్ చేశారు. షాక్ కి గురిఅయ్యారు. తన ఆశ్చర్యాన్ని ఆనందాన్ని సోషల్ మీడియా వేదికపై పంచుకున్నారు. ”మేము జపాన్ నుంచి వచ్చి వారం రోజులు అవుతోంది.

‘బాహుబలి’కి థాంక్స్. ఈ సినిమా కారణంగానే మాకు ఎన్నో దేశాలు తిరిగే ఛాన్స్ వచ్చింది. కానీ మేము తిరిగిన అన్ని దేశాల్లో జపాన్ మాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. వాళ్లు మాకోసం అరేంజ్ చేసిన రిసెప్షన్‌ని నేను ఎప్పటికీ మరచిపోలేను. అలాగే వారు మాపై, మా సినిమాపై చూపించిన ప్రేమని చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తోంది. నన్ను వాళ్లు చాలా గిఫ్ట్స్‌తో ఇంటికి పంపించారు. ఇప్పుడే మేము వాటిని ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాం. ఆ గిఫ్ట్స్ నాకు చాలా సంతోషం కలిగిస్తున్నాయి. మాకు ఇచ్చిన ప్రతీ గిఫ్ట్, ప్రతి ఆర్ట్ చాలా విభిన్నంగా, అమేజింగ్‌గా అనిపించింది. మీ ఎఫర్ట్‌కి చాలా చాలా థాంక్స్. నిజంగా నన్ను మీరు దీవించినట్టుగా ఫీల్ అవుతున్నాను. ప్రభాస్, రానా గిఫ్ట్స్‌ని నేను ఓపెన్ చెయ్యను. మేమంతా కలిసినపుడు ఓపెన్ చేస్తా. థాంక్యూ సోమచ్ జపాన్. లోడ్స్ ఆఫ్ లవ్” అంటూ రాజమౌళి ట్వీట్‌  చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus