ఈమధ్యకాలంలో వచ్చిన బెస్ట్ మాస్ సాంగ్

తెలుగులో మంచి మాస్ ఐటెమ్ సాంగ్ వచ్చి చాలా రోజులవుతోంది. నిన్న విడుదలైన “వాల్మీకి” చిత్రంలోని తొలి పాటతో ఆ లోటు తీరిపోయింది. “జర్రా జర్రా” అనే ఈ మాస్ నెంబర్ ప్రస్తుతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకొంటోంది. క్లాస్ మ్యూజిక్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన మిక్కీ జె.మేయర్ నుండి వచ్చిన మాస్ నెంబర్ కావడంతో జనాలు కాస్త ఆశ్చర్యపోయారు కూడా. ఉమా నేహా పాడిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంలో దర్శకుడిగా హరీష్ శంకర్ తప్పకుండా సూపర్ హిట్టు కొట్టడం ఖాయం అని స్పష్టమవుతోంది.

వరుణ్ తేజ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ నటుడు అథర్వ మురళి కీలకపాత్ర పోషిస్తుండగా.. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తమిళ చిత్రం “జీగర్తాండ”కు రీమేక్ గా హరీష్ శంకర్ మార్క్ మార్పులతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ మాస్ & నెగిటివ్ షేడ్ లుక్ కి ఇప్పటికే భీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట హిట్టైనట్లే.. సినిమా కూడా సూపర్ హిట్టు అవుతుందో లేదో తెలియాలంటే సెప్టెంబర్ 13 వరకూ వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus