Bigg Boss 5 Telugu: సీక్రెట్ టాస్క్‌ని చేజేతులా ఓడిపోయిన జెస్సీ!

బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ ఇచ్చాడు అంటే… దాంతో ఇంట్లో సందడి ఉండాలి. చూసేవాళ్లకు ఆనందం ఉండాలి. దీని కోసం రకరకాలుగా ఆలోచించి ఇస్తుంటాడు బిగ్‌బాస్‌. సీక్రెట్‌ టాస్క్‌ల సంగతి సరే సరి. మజాను డబుల్‌ చేయడానికి సీక్రెట్‌ టాస్క్‌లు ఇస్తూ ఉంటాడు. అయితే సీక్రెట్‌ టాస్క్‌ను సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది. ‘మిసెస్‌ ప్రభావతి గుడ్ల టాస్క్‌ సందర్భంగా జెస్సీకి ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌ చూస్తే తెలుస్తుంది.

ఇంటి సభ్యుల్లో ముగ్గురి దగ్గర గుడ్లు లేకుండా చూసుకో అని బిగ్‌బాస్‌ సీక్రెట్‌ టాస్క్‌ ఇస్తే… ఓ ముగ్గురు దగ్గరికెళ్లి ఒప్పిస్తే సరిపోతుంది అనుకున్నాడు జెస్సీ. ఇదే విషయం సిరి దగ్గర చెప్పేసరికి ఆమె తన మాటకారితనంతో షణ్ముఖ్‌, ప్రియాంక, ప్రియను ఒప్పించింది. దీంతో ఇక గెలిచినట్లే అనుకున్నాడు జెస్సీ. తర్వాత అసలు విషయం చెబితే… నువ్వు షాక్‌ అవుతావ్‌ అంటూ షన్ను కాసేపు ఊరడించారు కూడా. కానీ సీన్‌ రివర్స్‌ అయ్యింది.

అయితే టాస్క్‌ అయ్యాక… బిగ్‌బాస్‌ జెస్సీ సీక్రెట్‌ టాస్క్‌ గురించి చెప్పాడు. దీంతో జెస్సీ గెలిచేశాడు అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడే షాక్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. గుడ్లు లేకుండా చూడు అంటే… రిక్వెస్ట్‌ చేసి కాదు.. ఆట ఆడి చేయాలి అని బిగ్‌బాస్‌ చెప్పాడు. దీంతో జెస్సీ, సిరి షాక్‌… ఆటోమేటిగ్గా షన్నూ కూడా షాక్‌. దొంగతనం చేస్తావో, లాక్కుంటావో… ఏం చేస్తావో నీ ఇష్టం అనేది బిగ్‌బాస్‌ మాటల వెనుక అర్థం. ఇన్ని సీజన్లు చూశాక కూడా ఈ విషయం తెలియక జెస్సీ బొక్కబోర్లా పడ్డాడు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus