Jatadhara Review in Telugu: జటాధర సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సుధీర్ బాబు (Hero)
  • దివ్య కొస్లా (Heroine)
  • సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కార్, రవిప్రకాష్, శుభలేఖ సుధాకర్, ఝాన్సీ, రవిప్రకాష్ (Cast)
  • వెంకట్ కళ్యాణ్ - అభిషేక్ జైస్వాల్ (Director)
  • ఉమేష్ భన్సాల్ - నిఖిల్ నంద - ప్రేరణ అరోరా శివిన్ నారంగ్ (Producer)
  • రాజీవ్ రాజ్ - సమీరా కొప్పికర్ (Music)
  • సమీర్ కళ్యాణి (Cinematography)
  • నవీన్ నూలి (Editor)
  • Release Date : నవంబర్ 07, 2025
  • ఎస్.కె.జి ఎంటర్టైన్మెంట్ (Banner)

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మైథాలజీ ఫీవర్ నడుస్తుంది. ప్రతి సినిమాలో మన పురాణాల రిఫరెన్సులు లేదా దేవుడు గురించిన ఎలిమెంట్స్ తో నింపేస్తున్నారు. అలా వచ్చిన తాజా చిత్రం “జటాధర”. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. మరి సినిమా పరిస్థితి ఏంటి అనేది చూద్దాం..!!

Jatadhara Movie Review

కథ: ఆల్రెడీ ట్రైలర్ లోనే కథ మొత్తం దాదాపుగా చెప్పేశారు. అయితే.. ధన పిశాచి (సోనాక్షి సిన్హా), శివ (సుధీర్ బాబు)కి ఉన్న సంబంధం ఏమిటి? ఆమె ఎందుకని శివ మీద పగ పెంచుకుంటుంది? ఆ పిశాచి నుండి తప్పించుకోవడం కోసం శివ ఏం చేశాడు? ఈ క్రమంలో శివుడు ఎలా శివకి సహకరించాడు? అనేది “జటాధర” కథాంశం.

నటీనటుల పనితీరు: ఎప్పట్లానే సుధీర్ బాబు తనకు వీలైనంతలో తన బెస్ట్ ఇచ్చాడు. ముఖ్యంగా శివ తాండవం ఎపిసోడ్ & ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు.

పేరుకి సోనాక్షి సిన్హా సినిమాలో ఉన్నప్పటికీ.. కనీసం ఒక డైలాగ్ లేదు. ఉన్న ఒక్క పాటలోనూ ఆమె పెద్దగా అలరించలేకపోయింది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది కానీ, హావభావాలు మాత్రం బాగోలేవు.

బాలీవుడ్ హీరోయిన్ దివ్య కొస్లాను అక్కడి జనాలే పట్టించుకోలేదంటే.. ఇక్కడకి తీసుకొచ్చి తెలుగమ్మాయిగా చూపించే ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది.

శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, రవిప్రకాష్, ఝాన్సీ తదితరులు తమ సీనియారిటీతో పాత్రలను నెట్టుకొచ్చారు.

శిల్పా శిరోధ్కర్ కళ్లతో భయపెట్టడం వరకు పర్వాలేదు కానీ.. నటిగా మాత్రం అలరించలేకపోయింది.

సాంకేతికవర్గం పనితీరు: పాటలన్నీ పంజాబీ డబ్బింగ్ గీతాల్లా అనిపించాయి. ముఖ్యంగా స్పెషల్ సాంగ్ మరీ ఎబ్బెట్టుగా ఉంది. శివ తాండవం కాస్త పర్వాలేదు అనిపించింది.

గ్రాఫిక్స్, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ చాలా వీక్ ఉన్నాయి. ముఖ్యంగా సోనాక్షి సిన్హా సన్నివేశాల్లో గ్రాఫిక్స్ ఇంకాస్త బెటర్ గా ఉండొచ్చు.

దర్శకులు వెంకట్ కళ్యాణ్ – అభిషేక్ జైస్వాల్ లు ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినప్పటికీ.. దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం అలరించలేకపోయింది. ట్విస్టుల పరంగా కొన్ని సీక్వెన్సులు కూడా బాగానే రాసుకున్నారు. కానీ సరిగా తీయకపోవడంతో అవన్నీ వృథా అయిపోయాయి. అలాగే.. మైథాలజీ ఎలిమెంట్స్ ను ఇరికించిన విధానం కూడా మిస్ ఫైర్ అయ్యింది.

విశ్లేషణ: ట్రెండ్ కి తగ్గట్లు సినిమా తీయడంలో తప్పు లేదు కానీ.. ట్రెండ్ కోసం సినిమాలో అనవసరంగా ఎలిమెంట్స్ ని ఇరికించి సినిమా తీయడం అనేది అన్నిసార్లు వర్కవుట్ అవ్వదు. పాపం సుధీర్ బాబు ఎంత కష్టపడినా, కథనం ఆసక్తికరంగా లేకపోవడంతో “జటాధర” ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక చతికిలపడింది.

ఫోకస్ పాయింట్: భక్తి కూడా బోర్ కొట్టేస్తుంది!

రేటింగ్: 1.5/5

 

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus