Jawan: కమల్‌ సినిమా అన్నారు.. కాదు సత్యరాజ్‌ది అట.. అట్లీ స్ఫూర్తి స్ట్రీక్‌ కొనసాగుతోందా?

కోలీవుడ్‌లో కమర్షియల్‌ డైరక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుల్లో అట్లీ ఒకరు. విజయ్‌తో వరుస సినిమాలు చేసి, విజయాలు అందుకున్న అట్లీ.. ఇప్పుడు షారుఖ్‌ ఖాన్‌తో సినిమా బాలీవుడ్‌లో కూడా తనకు ఎదురులేదని నిరూపించాడు. అయితే అతని మీద ఉన్న పెద్ద అపవాదు.. పాత తమిళ సినిమాలు, సౌత్‌ సినిమాల నుండి స్ఫూర్తి పొందుతూ, కొన్ని సార్లు ఫ్రీమేక్‌ చేస్తుంటారు అని. ‘తెరి’ సినిమా నుండి ఈ అపవాదులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ‘జవాన్‌’ విషయంలోనూ అదే జరుగుతోంది.

‘జవాన్‌’ సినిమా అనౌన్స్‌ చేసినప్పుడే ఈ సినిమా ఏ సినిమాకు ఫ్రీమేక్‌ అంటూ చిన్నగా సన్నాయి నొక్కులు నొక్కారు తమిళ తంబీలు. అయితే ఎంత స్ఫూర్తి పొందినా, ఫ్రీమేక్‌ చేసినా తనదైన శైలిలో ఆ సినిమాను తెరకెక్కిస్తుంటారు అని అట్లీకి పేరు. ఇప్పుడు ‘జవాన్‌’ సినిమాను కూడా అలానే చేశారు అంటూ పాత తమిళ సినిమాల పేర్లు కొన్ని బయటకు తీశారు. రెండు తమిళ సినిమాల మూల కథను తీసుకొని అట్లీ ‘జవాన్‌’ను సిద్ధం చేశారు అనేది వారి మాట.

నిజానికి ‘జవాన్‌’ (Jawan) గురించి మాట్లాడినప్పుడు తొలుత కమల్ హాసన్ చాలా ఏళ్ల క్రితం చేసిన ‘ఓరు ఖైతియిన్ డైరీ’ అనే సినిమా గురించి మాట్లాడారు. తెలుగులో ‘ఖైదీ వేట’ పేరుతో ఆ సినిమా రిలీజ్‌ చేశారు. ఈ సినిమా కథాంశాన్ని తీసుకొనే ‘జవాన్‌’ తెరకెక్కించారు అని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ సినిమా కాదు సత్య రాజ్‌ చేసిన సినిమా అని చెబుతున్నారు. 1989లో సత్యరాజ్ హీరోగా వచ్చిన ‘తాయ్ నాడు’ అనే సినిమా ‘జవాన్‌’కు మూలం అంటున్నారు.

నిజాయితీ గల మిలిటరీ ఆఫీసర్‌ను ఓ కేసులో అన్యాయంగా ఇరికించి… శత్రువులకు సహకారం అందించాడన్న అభియోగం మీద అవమానిస్తారు. ఆ తర్వా అసలు నిజం బయటికి రాకుండా చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తారు. దీంతో అతని కుటుంబం అవమానాల పాలవుతుంది. ఆ తర్వాత కొడుకు పెరిగి పెద్దవాడై తండ్రిని, కుటుంబాన్ని ఆ స్థితికి తీసుకొచ్చిన వాళ్లను పట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాడు. ‘తాయ్‌ నాడు’లోని ఈ కథను తీసుకొని కాస్త మార్చి ‘జవాన్‌’ తీశారు అంటున్నారు. దీంతో అట్లీ మీ హిట్‌ లాజిక్‌ ఇదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus