Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

అప్పటివరకు వరుస సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా కెరీర్‌ను నిర్మించుకుంటూ వచ్చిన ఓ స్టార్‌ హీరోయిన్‌ పెళ్లి చేసేసుకుంది. ఈ క్రమంలో సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత మరికొన్నేళ్లకు ఏకంగా సినిమాల నుండి విరామం తీసుకుంది. కారణం పెళ్లి అని అందరూ అనుకున్నారు. ఆమె కూడా అదే చెప్పింది. అయితే దీనికి ముఖ్య కారణం తన కుమార్తె అడిగిన ఓ మాట అట. ఈ విషయాన్ని ఆమెనే ఇటీవల చెప్పుకొచ్చారు. ఆమెనే బాలీవుడ్ సీనియర్‌ నటి జయా బచ్చన్‌.

Jaya Bachchan

1963 సత్యజిత్‌ రే దర్శకత్వం ‘మహానగర్‌’ సినిమాతో జయా బచ్చన్‌ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సుమారు 18 ఏళ్లపాటు నటిగా ప్రయాణం సాగించిన ఆమె 1981లో ‘సిల్సిలా’ సినిమా తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్నారు. తిరిగి 1995లో ‘డాటర్స్‌ ఆఫ్‌ దిస్‌ సెంచరీ’ సినిమాతో తిరిగి ముఖానికి రంగేసుకున్నారు. చివరిగా 2023లో ‘రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ సినిమాలో కనిపించారు. అయితే తన కుమార్తె అడిగిన ఒక మాట తననెంతో కదిలించిందని.. అందుకే నటనకు విరామం తీసుకున్నట్లు తాజాగా వెల్లడించారు.

1973లో అమితాబ్‌ బచ్చన్‌తో వివాహం తర్వాత సినిమాలు తగ్గించిన జయ.. 1981 తర్వాత విరామం తీసుకున్నారు. ఓసారి జయా బచ్చన్‌ ఇంట్లోనే మేకప్‌ వేసుకొని సెట్స్‌కి వెళ్లడానికి రెడీ అవుతున్నారట. అప్పుడు ఆమె కుమార్తె శ్వేత దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగిందట. షూట్‌కు వెళ్లడానికి రెడీ అవుతున్నానని చెప్పారు జయ. దానికి శ్వేత ‘అమ్మా నువ్వు వెళ్లొద్దు.. నాన్నని వెళ్లమని చెప్పు’ అని అందట. ఆ మాట జయను తీవ్రంగా కదిలించిందట. ఇంట్లో ఆమెను చూసుకోవడానికి చాలామంది ఉన్నా తల్లి ప్రేమ ముఖ్యం అనిపించిందట. అందుకే విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నా అని జయ చెప్పారు.

అయితే శ్వేత వివాహం తర్వాత ఒంటరితనంగా అనిపించిందట. ఏదో మిస్‌ అవుతున్న ఫీలింగ్‌ వచ్చిందట. ఎన్నోసార్లు కన్నీరు కూడా పెట్టుకున్నారట. ఆ సమయంలోనే మళ్లీ సినిమా ఛాన్స్‌ వస్తే అంగీకరించాను అని జయా బచ్చన్‌ తెలిపారు.

స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus