ఇటీవల ఇండియన్ విమెన్ క్రికెట్ టీం కెప్టెన్ అయిన స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అనేది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే! సంగీత్, మెహందీ ఫంక్షన్ వంటి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అన్నీ జరిగాయి. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా… పెళ్లి ఆగిపోయింది. ఏదో సినిమాల్లో చూపించినట్టు. పలాష్ ముచ్చల్ తో పెళ్లి వద్దని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నట్టు స్మృతి తెలిపింది.
అందుకు ఆమె కారణాలు ఆమెకు ఉండొచ్చు. కానీ దేశవ్యాప్తంగా ఇది సంచలనమైంది. అదే సీన్ ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ విషయంలో కూడా జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. స్మృతి మంధాన తరహాలో స్మృతి మందాన పెళ్లి కూడా క్యాన్సిల్ అయినట్టు అంతా చెప్పుకుంటున్నారు.విషయం ఏంటంటే.. నివేదా పేతురాజ్ తాను నిశ్చితార్థం వ్యక్తిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసింది.
ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకునే భార్యాభర్తలు అయినా, ఎంగేజ్మెంట్ చేసుకున్న వారైనా ఫస్ట్ చేస్తున్న పని ఇదే. దీంతో వీరి ఫాలోవర్స్ కి సగం మేటర్ చెప్పేసినట్టు అవుతుంది. చాలా మంది స్టార్స్ విషయంలో ఇది నిజమైంది కూడా. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త రజత్ ఇబ్రాన్ ను ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకుంది.ఆ ఫోటోలు కూడా అఫీషియల్ గా రిలీజ్ చేసింది. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఫోటోలు డిలీట్ చేసింది.
రజత్ కూడా ఇదే పనిచేశాడు. అలాగే ఒకరినొకరు అన్ ఫాలో చేసేసుకున్నారు. సో వీళ్ళ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని.. కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అధికారికంగా నివేదా ఈ విషయం పై ఎప్పుడు మీడియాతో ఓపెన్ అవుతుందో చూడాలి.