‘జీ కర్దా’ వెబ్ సిరీస్ నిన్నటి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది హిందీలోనే తీసినప్పటికీ.. సౌత్ లోని అన్ని భాషల్లో డబ్ అయ్యింది. ఇందులో తమన్నా నటించడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ట్రైలర్ ఏ రేంజ్లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఈ ‘జీ కర్ధా’ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :
కథ : రిషబ్ రాథోడ్ (సుహైల్ నయ్యర్), లావణ్యా సింగ్ (తమన్నా), స్కూల్ మేట్స్. తర్వాత వీరిద్దరూ సహజీవనం సాగిస్తారు . పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అవుతారు. ఆ తర్వాత ఏమైంది? అనేది ఒక కథ అయితే స్కూల్ డేస్ నుండి లావణ్య, రిషబ్ ల ఫ్రెండ్ అయిన పాపులర్ పంజాబీ సింగర్ అర్జున్ గిల్ (ఆశిమ్ గులాటీ) వివాదాలతో సహజీవనం చేస్తుంటాడు.
అయితే అతని పై పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఒక సితార్ విద్వాంసుడు కేసు వేస్తాడు? అది ఎందుకు? అనేది మరో కథ. ఇక ప్రీత్ (అన్యా సింగ్) తనకు సూట్ అయ్యే తోడు కోసం చూస్తుంటుంది. ఆమె కథ మరోవైపు తర్వాత షీతల్ (సంవేదన), షాహిద్ (హుస్సేన్ దలాల్) ల కథ మరోవైపు. ఇలా 8 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ సాగుతూ ఉంటుంది.
నటీనటుల పనితీరు: తమన్నా మొదటి నుండి గ్లామర్ రోల్సే చేసింది. కానీ హద్దులు మీరిన బోల్డ్ సన్నివేశాల్లో నటించిన సందర్భాలు బాగా తక్కువ. అయితే ఆ హద్దులు ఈసారి ఆమె చెరిపేసింది అని చెప్పొచ్చు. పాత్ర డిమాండ్ చేయడం వల్లనో ఏమో కానీ.. ఆమె బోల్డ్ / రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. అన్యా సింగ్… ప్రీత్ పాత్రలో ఆకట్టుకుంది. ఈమె పాత్రలో ఫన్, రొమాన్స్ గట్టిగానే ఉంటుంది.సుహైల్ నయ్యర్, ఆషిమ్ గులాటీ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : ‘జీ కర్దా’ దర్శక, రచయితలు.. ‘ఇప్పటి జనరేషన్ యూత్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ప్రేమను ఇందులో వెతుక్కుంటున్నారు..? లివ్-ఇన్ రిలేషన్ షిప్ లోనా? శృంగార*లోనా? అనే పాయింట్’ పై బాగానే ఫోకస్ పెట్టి ఈ సిరీస్ ను రూపొందించారు. వాళ్ళు అనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ.. దాన్ని తెరపైకి తెచ్చే క్రమంలో ఎమోషన్ అనేది పండలేదు. ఎంత బోల్డ్ సీన్స్ ఉన్నా.. యూత్ ఎగబడి చేసేస్తారు అనుకోవడం తప్పు.
ఇక్కడ అరుణిమా శర్మ, హోమీ అదజనియా చేసింది అదే. ‘వెబ్ సిరీస్ అంటే బూతులు, పడకసుఖాలను చూపించడం, లిప్ లాక్ లు వంటివి మేకర్స్ కూడా మార్చుకోవాలి’ అనే విషయాన్ని ‘జీ కర్దా’ ద్వారా చాటిచెప్పారు మేకర్స్.ఇందులో ట్విస్ట్ లు వంటివి కూడా అంతగా లేవు. మహేంద్ర జె శెట్టి సినిమాటోగ్రఫీకి మాత్రం ఫుల్ మార్క్స్ వేయొచ్చు. సచిన్ – జిగర్స నేపథ్య సంగీతం కూడా ఒకే. నిర్మాత కథకి తగ్గట్టు బాగానే ఖర్చు పెట్టారు.
విశ్లేషణ : ‘జీ కర్దా’ పెద్దగా ఎంటర్టైన్ చేయదు. బోరింగ్ సన్నివేశాలు బాగా ఎక్కువ.వీకెండ్ కి ఏదో ఒక సినిమా లేదా సిరీస్ చూడాలనుకునేవారు తప్ప మిగిలిన వారు లైట్ తీసుకోవచ్చు. తమన్నా బోల్డ్ సన్నివేశాల కోసం మాత్రమే చూడాలనుకుంటే మాత్రం బుక్కైపోయినట్టే..!
రేటింగ్ : 2/5