Chiranjeevi, Rajasekhar: మెగా ఫ్యామిలీ – రాజశేఖర్‌ గొడవపై జీవిత కామెంట్స్‌!

టాలీవుడ్‌లో ఎప్పటి నుండో ఉన్నాయి అని అంటూనే, లేవు అనిపిస్తున్న వివాదాలు ఓ రెండు ఉన్నాయి. అందులో కామన్‌ పాయింట్‌ మెగా కుటుంబం. ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఆ వివాదాలు ఏంటో. ఆ రెండు వివాదాల్లో ఒక దాని గురించి చెప్పే సందర్భం ఇది కాదు కాబట్టి… ఆ రెండో దాని గురించే చూద్దాం. అదే మెగా కుటుంబం – జీవితరాజశేఖర్‌. అప్పుడెప్పుడో ఏదో సినిమా రీమేక్‌ హక్కుల నుండి మధ్యలో ప్రజారాజ్యం పార్టీపై కామెంట్ల వరకు… తర్వాత ‘మా’ డైరీ ఆవిష్కరణ విషయం. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం ఉంది. తాజాగా దీనిపై జీవిత స్పందించారు.

మీకు గుర్తుండే ఉంటుంది. కొన్ని నెలల క్రితం ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో వేదికపైనే… రాజశేఖర్‌ వచ్చి ఇండస్ట్రీ పెద్దల్ని ఎదిరించి మాట్లాడారు. వద్దని ఎంతమంది చెప్పినా వినకుండా… తన మాటలు చెప్పేసి వెళ్లిపోయారు. ఇందులో చిరంజీవి తప్పు ఉందంటూ కొంతమంది కామెంట్లు చేశారు. దీనిపై జీవిత మాట్లాడుతూ ‘‘మెగా ఫ్యామిలీకి మాకూ వివాదం జరిగి చాలా ఏళ్లైంది. ఒకే ఇంట్లో ఉండే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. అలాంటిది మా మధ్య జరిగిన చిన్న విసయాన్ని ప్రతిసారీ ‘మెగా ఫ్యామిలీ-రాజశేఖర్‌’ అంటూ పెద్దది చేసి చూపిస్తున్నారు అని అన్నారు జీవిత.

అప్పుడెప్పుడో తప్ప ఆ తర్వాత మా మధ్య ఎప్పుడూ వివాదం జరగలేదని చెప్పారు జీవిత. ‘మా’ డైరీ విడుదల సందర్భంగా జరిగిన వివాదంలో చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదు. నరేశ్‌, ‘మా’ ప్యానల్‌కు సంబంధించి రాజశేఖర్‌ ఆ రోజు స్టేజీ మీద మాట్లాడారు. ఈ నేపథ్యంలో ‘మా’ సభ్యులకు సర్దిచెబుతూ పనిచేయాలని పెద్దలు సూచించారు. అయితే, అందుకు నరేశ్‌ ఒప్పుకోలేదు అని జీవిత చెప్పారు. అలాంటి కార్యక్రమంలో, ఆ వేదిక మీద అలా మాట్లాడటం సరికాదని చిరంజీవి సూచించారు. అయితే, మీడియానే దాన్ని ఇంకాస్త పెద్దది చేసి చూపించింది. ‘మా’లో ఏం జరిగినా, చిరంజీవి – రాజశేఖర్ విషయంలో ఏం జరిగినా… ఎప్పుడో జరిగిన గొడవకు ఆపాదించి పెద్దది చేస్తున్నారు అని జీవిత అభిప్రాయపడ్డారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus