Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 1, 2026 / 01:29 PM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • స‌త్య‌ (Hero)
  • రియా సింఘా (Heroine)
  • వెన్నెల కిషోర్‌, అజ‌య్‌, క‌బీర్ సింగ్ దుహాన్‌, హ‌ర్ష చెముడు, శ్రీనివాస‌రెడ్డి త‌దిత‌రులు (Cast)
  • రితేష్ రానా (Director)
  • చిరంజీవి, హేమ‌ల‌త పెద‌మ‌ల్లు (Producer)
  • కాల‌భైర‌వ‌ (Music)
  • సురేష్ సారంగం (Cinematography)
  • కార్తీక శ్రీనివాస్‌ (Editor)
  • Release Date : 1st మే 2026
  • క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ (Banner)

క‌మెడియ‌న్లు హీరోలుగా మార‌డం టాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. బ్ర‌హ్మానందం, సునీల్ నుంచి చాలా మంది హాస్య‌న‌టులు హీరోలుగా సినిమాలు చేశారు. జెట్‌లీ (Jetlee) మూవీతో వారి బాట‌లోనే టాలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ స‌త్య అడుగులు వేశారు. మ‌త్తు వ‌ద‌ల‌రా ఫేమ్ రితేష్ రానా ద‌ర్శ‌క‌త్వంలో కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో చెర్రీ, హేమ‌ల‌త నిర్మించారు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? హీరోగా స‌త్య తెలుగు ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాడా ? లేదా? అంటే?

Jetlee Movie Review

Jetlee Movie Review and Rating

కథ: ప్ర‌జాప‌తి బ్యాంకు దివాళా తీస్తుంది. బాధితులు రోడ్డున ప‌డ‌తారు. ఈ న‌ష్టాల‌కు కార‌ణం హ‌రీష్ చంద్ర (శుభ‌లేఖ సుధాక‌ర్‌) అనే వ్య‌క్తి అని త‌ప్పుడు ఆధారాలు సృష్టించి బ్యాంకు ఓన‌ర్ ప్ర‌జాప‌తి (అజ‌య్‌) దుబాయ్ పారిపోతాడు. ప్ర‌జాప‌తి ఆచూకీ క‌నిపెట్టాల‌ని హోమ్ మంత్రి మేల్కొటే ఆర్డ‌ర్స్ వేస్తాడు. ఈ సీక్రెట్ ఆప‌రేష‌న్‌ను ఏజెంట్ శివానీ రాయ్ (రియా సింఘా) చేప‌డుతుంది. ప్ర‌జాప‌తి ప‌ట్టుకొని దుబాయ్ నుంచి కొచ్చికి వ‌చ్చే ఫ్లైట్‌లో ఇండియా తీసుకురావాల‌ని అనుకుంటుంది. అదే ఫ్లైట్‌లో ప్ర‌జాప‌తిని చంపాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నిస్తుంటారు. డాక్ట‌ర్ వేద‌వ్యాస్ (స‌త్య‌) కార‌ణంగా వారి ప్లాన్స్ ఫెయిల‌వుతాయి. అస‌లు వేద‌వ్యాస్ ఎవ‌రు? ప్ర‌జాప‌తి మ‌నిషిగా ఆ ఫ్లైట్ ఎక్కిన వేద‌వ్యాస్ అత‌డికే ఎందుకు ఎదురుతిర‌గాడు? జాన్ సెనా, స‌త్య అక్క‌ల అంటూ ర‌క‌ర‌కాల మారుపేర్లు ఎందుకు చెప్పాడు? ప్ర‌జాప‌తిపై ప‌గ‌తో ఆ ఫ్లైట్‌లోకి ఎక్కిన హ‌రీష్ చంద్ర కొడుకు ఎవ‌రు? వేద‌వ్యాస్ ప్లాన్ ఏమిటి? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Jetlee Movie Review and Rating

నటీనటుల పనితీరు: జెట్‌లీ సినిమాకు స‌త్య వ‌న్ మెన్ షోగా నిలిచాడు. సినిమా ఫ‌స్ట్ సీన్ నుంచి లాస్ట్ వ‌ర‌కు ప్ర‌తి ఫ్రేమ్‌లో క‌న‌బ‌డ్డాడు. త‌న డైలాగ్ డెలివ‌రీ, మ్యాన‌రిజ‌మ్స్‌తో కొన్ని చోట్ల న‌వ్వించాడు. సినిమా ఫ‌జిల్స్‌ నింపే వ్య‌క్తిగా వెన్నెల‌కిషోర్ పంచ్‌లు కొన్ని పేలాయి. యాక్ష‌న్ రోల్‌లో రియా సింఘా ఒకే అనిపించింది. అజ‌య్‌, క‌బీర్ సింగ్ దుహాన్‌ల‌కు ఇలాంటి పాత్ర‌లు కొత్త కాదు. గెట‌ప్ శ్రీను, గుండు సుద‌ర్శ‌నం, శ్రీనివాస‌రెడ్డి, హ‌ర్ష చెముడు…ఇలా చాలా మందే సినిమాలో క‌మెడియ‌న్లు ఉన్నా ఎవ‌రూ న‌వ్వించ‌లేక‌పోయారు.

Jetlee Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: టెక్నిక‌ల్‌గా కాల‌భైర‌వ మ్యూజిక్ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. కామెడీ థ్రిల్ల‌ర్ మూవీకి త‌గ్గ‌ట్లుగా బీజీఎమ్ అందించాడు. రితేష్ రానా ద‌ర్శ‌కుడిగానే కాకుండా రైట‌ర్‌గా ఫెయిల‌య్యాడు. తాను రాసుకున్న కాన్సెప్ట్‌ను పూర్తిగా థ్రిల్ల‌ర్ సినిమాగా తెర‌కెక్కించాలా? కామెడీ మూవీగా చేయాలా అనే క‌న్ఫ్యూజ‌న్ అత‌డిలో బాగా క‌నిపించింది. . చిన్న సినిమానే అయినా ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. చెర్రీ, హేమ‌ల‌త బ‌డ్జెట్ విష‌యంలోఎక్క‌డ రాజీప‌డ‌లేదు. ఎడిట‌ర్ కార్తీక శ్రీనివాస్ క‌త్తెర‌కు ప‌నిచెప్పాల్సిన సీన్లు చాలానే ఉన్నాయి. సురేష్ సారంగం సినిమాటోగ్ర‌ఫీ బాగుంది.

Jetlee Movie Review and Rating

విశ్లేషణ: క్విర్కీ కామెడీ కాన్సెప్ట్‌తో తెలుగులో వ‌చ్చిన‌ జాతిర‌త్నాలు, మ్యాడ్‌, మ‌త్తు వ‌ద‌ల‌రాతో పాటు ప‌లు సినిమాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ఈ క‌థ‌ల్లో లాజిక‌ల్‌ల‌తో ప‌ని ఉండ‌దు. గ‌మ్మ‌త్తైన పాత్ర‌లు, వాటి తాలూకు మ్యాన‌రిజ‌మ్స్‌, ఆ క్యారెక్ట‌ర్లు చేసే అల్ల‌రి, హ‌డావిడి వినోదాన్ని పంచుతాయి.

జెట్ లీ అలాంటి సినిమానే. బ్యాంకు స్కామ్‌లు అనే సెన్సిటివ్‌ పాయింట్‌కు కామెడీని జోడించి ద‌ర్శ‌కుడు రితేష్ రానా ఈ క‌థ‌ను రాసుకున్నారు. సినిమా మొత్తం ఫ్లైట్‌లోనే సాగుతుంది. అందులోనూ స్టార్ క‌మెడియ‌న్ స‌త్య హీరో అన‌గానే జెట్‌లీ పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ ఆడియెన్స్‌కు ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు మాత్రం సినిమా రీచ్ కాలేక‌పోయింది.

దుబాయ్ నుంచి ఇండియాకు వ‌చ్చే ఫ్లైట్ జ‌ర్నీలో నాలుగు గంట‌ల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల స‌మాహార‌మే ఈ క‌థ . చిన్న పాయింట్‌ను తీసుకొని స్ఫూఫ్‌లు, పంచ్‌ల‌తో రెండు గంట‌లు న‌వ్వించ‌డానికి డైరెక్ట‌ర్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు.

ప్ర‌జాప‌తి పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తూనే ఈ సినిమా మొద‌ల‌వుతుంది. ఫ్లైట్‌లో త‌న గతం మ‌ర్చిపోయి బ్లైండ్ డాక్ట‌ర్‌గా ఆరంభంలో స‌త్య చేసే కామెడీ కాస్తంత ప‌ర్వాలేద‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత ఒక్కో పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తూ ఓ వైపు కామెడీ, మ‌రోవైపు స‌స్పెన్స్ క్రియేట్ చేయాల‌ని అనుకున్నారు డైరెక్ట‌ర్‌. ఈ క్ర‌మంలో తాను క‌న్ఫ్యూజ్ అయ్యి ఆడియెన్స్‌ను క‌న్ఫ్యూజ్ చేశాడు. మ‌ల్టీ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ టైప్‌లో స‌త్య పాత్ర చిత్ర విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తుంది. ఓ సారి సీక్రెట్ ఏజెంట్‌, మ‌రోసారి విల‌న్ గ్యాంగ్ మెంబ‌ర్ అత‌డు చేసే హ‌డావిడి, హిందీలో సంబంధం లేకుండా చెప్పే డైలాగ్స్ న‌వ్వించ‌లేక‌పోగా చిరాకును తెప్పించాయి.

పోనీ సెకండాఫ్‌లోనైనా ద‌ర్శ‌కుడు ట్రాక్‌లా ప‌డ్డాడా అంటే అదీ లేదు. హైజాక్‌, బాంబు డ్రామా అంటూ సిల్లీగా క్లైమాక్స్ వ‌ర‌కు సాగ‌దీశారు. సీన్‌కు సంబంధం లేకుండా నాన్ సింక్‌లో డైలాగ్స్ చెబుతూ పాత్ర‌ల‌న్నీ ఇరిటేట్ చేస్తాయి. ఓ టైమ్‌లో అస‌లు స్క్రీన్‌పై ఏం జ‌రుగుతుందో కూడా అంతు ప‌ట్ట‌దు.

పోలీస్ స్టోరీ, నాన్న‌కు ప్రేమ‌తో పాటు చాలా సినిమాల స్ఫూఫ్‌లు ఈ సినిమాలో క‌నిపిస్తాయి. దేవ‌ర క‌థ తెలియాలి… మైండ్‌లో ఫిక్స‌యితే బ్లైండ్‌గా వెళ్లిపోతా లాంటి డైలాగ్స్‌ను కామెడీ కోసం వాడాడు. స‌త్య త‌న‌పై తానే సెటైర్లు వేసుకున్నారు. అజ‌య్‌, వెన్నెల‌కిషోర్ యాక్టింగ్‌పై పంచ్‌లు వేశారు. ఏవి సినిమాను కాపాడ‌లేదు. బాల‌కృష్ణ స్టైల్‌లో పైలెట్ చెప్పే డైలాగ్స్ కొంత వ‌ర‌కు న‌వ్వించాయి. న్యాయం కావాలి, చంట‌బ్బాయితో పాటు చిరంజీవి రిఫ‌రెన్స్‌ల‌ను చాలానే వాడారు. క్లైమాక్స్‌లో వెన్నెల కిషోర్ పాత్ర విష‌యంలో వ‌చ్చే ట్విస్ట్ ఒక‌టి ప‌ర్వాలేద‌నిపిస్తుంది.

Jetlee Movie Review and Rating

ఫోకస్ పాయింట్: జెట్ లీ నో లాజిక్స్‌.. నో కామెడీ.. ఓన్లీ ప్ర‌స్టేష‌న్‌..

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jetlee Movie
  • #Rhea Singha
  • #Ritesh Rana
  • #satya
  • #Vennela Kishore

Reviews

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

10 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

12 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

14 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

15 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version