Jhansi: పోలీసుల రైడ్ లో పట్టుబడ్డారని రాశారు.. ఆవేదన వ్యక్తం చేసిన ఝాన్సీ!

  • May 11, 2023 / 07:32 PM IST

ఒకానొక సమయంలో బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని బుల్లితెరపై ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో యాంకర్ ఝాన్సీ ఒకరు. ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఝాన్సీ అనంతరం సినిమా అవకాశాలను కూడా అందుకొని సినిమా ఇండస్ట్రీలో కూడా బిజీ అయ్యారు.ఇలా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్న ఝాన్సీ ప్రస్తుతం అవకాశాలను కోల్పోయారని చెప్పాలి. ప్రస్తుతం ఝాన్సీ అడపాదడపా సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఝాన్సీ (Jhansi) మీడియా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా రాసే రాతలు కారణంగా కొందరి వ్యక్తిగత జీవితాలు ఇబ్బందుల్లో పడతాయని ఈమె వెల్లడించారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీల గురించి వార్తలు రావడం సర్వసాధారణం పలానా సెలబ్రిటీలు రిలేషన్లో ఉన్నారని వారితో అఫైర్స్ ఉన్నాయి అంటూ వార్తలు వస్తూనే ఉంటాయి.

ఇలాంటి వార్తలు రావడం వల్ల కొందరి జీవితంపై ఈ వార్తల ప్రభావం పడటంతో అవకాశాలు కూడా రాకుండా పోయి తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు.అయితే తన పరిస్థితి కూడా అలాంటిదేనని ఝాన్సీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ ఒక వెబ్సైట్ తన గురించి ఘోరంగా వార్తలు రాసారని తెలియజేశారు. తాను ఒక హీరోతో ఎఫైర్ పెట్టుకున్నానని పోలీస్ రైడ్ లో దొరికిపోయాను అంటూ వార్తలు రాశారు.

ఇలా ఎలాంటి ఆధారాలు లేకుండా అర్థంలేని రాతలు రాసి నన్ను చాలా మానసిక క్షోబకు గురి చేసారని ఈ సందర్భంగా ఈమె తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా నిజానిజాలు తెలియకుండా ఒక వ్యక్తి గురించి ఈ విధమైనటువంటి అబండాలు వేస్తే ఏ విధమైనటువంటి మానసిక క్షోబను ఎదుర్కొంటారో వారికి తెలియదని, ఈ సంఘటనల కారణంగా తాను ఓ మంచి పదవిని కోల్పోయాను అంటూ ఈ సందర్భంగా ఝాన్సీ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus