Homebound: మరో రెండు అడుగుల దూరంలో జాన్వీ సినిమా.. ఆస్కార్‌ వస్తుందా?

ప్రఖ్యాత సినిమా అవార్డుల కార్యక్రమం ఆస్కార్‌లో వచ్చే ఏడాది ఇండియన్‌ సినిమా మెరవబోతోందా? ఏమో ఫ్లో చూస్తుంటే అలా అనిపిస్తోంది. చెప్పినంత ఈజీగా మన సినిమాకు అవార్డు రాకపోవచ్చు కానీ.. ఓ భారతీయ సినిమా ఆస్కార్‌ పురస్కారానికి రెండు అడుగుల దూరంలో ఉందని చెప్పొచ్చు. ఇషాన్‌ కట్టర్‌, విశాల్‌ జెత్వా, జాన్వీ కపూర్‌ కలసి నటించిన ‘హోమ్‌బౌండ్‌’ సినిమానే ఆ ఘనతకు దగ్గరలో ఉంది. ఈ సినిమా బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ విభాగంలో భారత్‌ తరఫున ఆస్కార్‌ 2026 పురస్కారాలకుకు అధికారిక ఎంట్రీ పొందిన విషయం తెలిసిందే.

Homebound

‘హోం బౌండ్‌’ సినిమా ఆస్కార్‌ పోరులో మరో ముందడుగు వేసింది. ఆస్కార్‌ ఎంపికలో కీలకమైన షార్ట్‌ లిస్ట్‌ జాబితాలో జాన్వీ సినిమా చోటు దక్కించుకొంది. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. భారతీయ సినీ రంగానికి ఇదొక మైలురాయి అని పేర్కొంది. 12 విభాగాల్లో పోటీ పడుతున్న సినిమా షార్ట్‌లిస్ట్‌ను అకాడెమీ అవార్డ్స్‌ ఇటీవల ప్రకటించింది. అందులో ‘హోమ్‌బౌండ్‌’ కూడా ఉంది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ విభాగంలో 15 చిత్రాలను షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఇక తుది జాబితాలో వీటిని ఐదుకి తగ్గించనున్నారు.

ఆ ఐదు సినిమాల జాబితాను జనవరి 22న ప్రకటిస్తారు.. వచ్చే ఏడాది మార్చి 15న జరగనున్న అవార్డుల వేడుకలో ఆ ఐదులో ఒక సినిమాకు పురస్కారం అందజేస్తారు. ఆ లెక్కన నీరజ్‌ గేవాన్‌ తెరకెక్కించిన ‘హోంబౌండ్’ రెండు అడుగుల దూరంలో ఉన్నట్లు. మరి ఆ రెండు అడుగుల్ని విజయవంతంగా వేసి భారతీయ సినిమా ఆ ఘనత అందిస్తారేమో చూడాలి. కరణ్ జోహార్‌ నిర్మించిన ఈ సినిమా కథ సంగతి చూస్తే.. పోలీసు కావాలనే తమ కలను సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కుల, మత వివక్షకు వ్యతిరేకంగా ఇద్దరు స్నేహితులు చేసిన పోరాటమే ఈ సినిమా కథాంశం. ఈ సినిమాను చూడాలని అనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

ప్లాస్టిక్ సర్జరీ వార్తల పై రకుల్ క్లారిటీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus