ఓ సినిమా ట్రైలర్ చూస్తే… బాగుంది అనే ఫీల్‌యేనా కలగాలి, లేదంటే బాగోలేదు అనే ఫీలింగ్ అయినా కలగాలి. కానీ ‘ఇదేంటి ఇలా ఉంది’ అని మాత్రం అనిపించకూడదు. కానీ ఇటీవల విడుదలైన ఓ బాలీవుడ్ సినిమా టీజర్ చూస్తే కచ్చితంగా ఇదే అనిపిస్తోంది. అది దర్శకుడి ఆలోచనా, హీరో ఆలోచనా అనేది తెలియదు కానీ… చూసిన ప్రతి ఒక్కరి ఆలోచన మాత్రం ‘అరె ఏంట్రా ఇదీ’. కావాలంటే మీరూ ఒకసారి చూడండి మీకే అర్థమైపోతుంది.
బాలీవుడ్ సినిమాలను బాగా ఫాలో అయ్యేవారికి ఇప్పటికే మేం ఏం ట్రైలర్ గురించి చెబుతున్నామో తెలిసిపోతుంది. అయినా చెప్పడం మా బాధ్యత కాబట్టి చెబుతున్నాం. ఆ సినిమా ‘సత్యమేవ జయతే 2’. మూడేళ్ల క్రితం వచ్చిన ‘సత్యమేవ జయతే’కి ఇది సీక్వెల్. తొలి సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ జోష్‌లో ఇప్పుడు ఈ సినిమా చేశాడు జాన్ అబ్రహమ్. అంతేకాదు ఇందులో ట్రిపుల్ రోల్ కూడా చేశాడు. పోలీసు – రౌడీ – రాజకీయ నాయకుడు నేపథ్యంలో సాగే సినిమా ఇది అని చెప్పడానికి దర్శకుడు ట్రైలర్ కట్‌ని అత్యంత విచిత్రంగా చేశాడు అని చెప్పొచ్చు.
మూడు నిమిషాల ట్రైలర్‌తో చూసినవాడిని ముప్పతిప్పలు పెట్టాడు అనొచ్చు. దేశభక్తి సినిమా అంటే అరుపులు, ఆగ్రహాలు, భారీ యాక్షన్ విన్యాసాలు మాత్రమే అనుకున్నారేమో… వాటితోనే నింపేశారు. జాన్ అబ్రహం ముఖంలో కళ లేదు. దీంతో చూసినవాళ్లకు రోత పుడుతుంది. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది వేరే విషయం.
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?