Joker Sequel: రూ.9000 కోట్ల సినిమాకు సీక్వెల్‌.. ఎప్పుడు రిలీజ్‌ అవుతుందంటే?

  • August 22, 2024 / 10:15 AM IST

రూ. 450 కోట్లు ఖర్చు పెట్టిన తీసిన సినిమాకు రూ. 9000 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయి. ఈ మాట చాలు కదా.. ఆ సినిమా విజయం ఎంతటిదో చెప్పడానికి. ఆ సినిమానే ‘జోకర్‌’. జోక్విన్‌ ఫీనిక్స్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే విజయం అందుకుంది. ఎట్టకేలకు ఆ సినిమాకు సీక్వెల్ (Joker Sequel) రెడీ అయింది. తాజాగా సినిమా రిలీజ్‌ డేట్‌ను టీమ్‌ అనౌన్స్‌ చేసింది.

Joker Sequel

‘జోకర్‌: ఫోలి అ దు’ పేరుతో ‘జోకర్‌’ సీక్వెల్‌ను (Joker Sequel) రూపొందించారు. ఇందులో ప్రముఖ హాలీవుడ్‌ కథానాయిక, పాప్‌ సింగర్‌ లేడీ గాగా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో కీలక పాయింట్‌ ఏంటి అనేది ప్రచార చిత్రాల ద్వారా టీమ్‌ చెప్పకనే చెప్పేపసింది. ‘ఈ ప్రపంచం ఓ వేదిక’ అంటూ రాసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ టీమ్‌ రిలీజ్‌ డేట్‌ చెప్పింది. ముఖంపై రక్తంతో, ఇద్దరూ కలసి డ్యాన్స్‌ చేస్తున్నట్లుగా ఆ పోస్టర్‌కు మంచి స్పందనే వస్తోంది.

‘‘సంగీతంతోనే జీవితాలు పూర్తవుతాయి. దాని వల్లే మా గాయాలూ మానుతాయి. నేనిప్పుడు ఒంటరివాణ్ని కాదు’’ అంటూ సినిమా మెయిన్‌ ప్లాట్‌ గురించి చెప్పారు. ఈ సినిమాను అక్టోబరు 4న విడుదల చేస్తున్నట్లు టీమ్‌ ప్రకటించింది. బాబ్‌ కేన్, బిన్‌ ఫింగర్, జెర్రీ రాబిన్సన్‌ కలసి రాసిన ‘ది జోకర్‌’ అనే కామిక్‌ పుస్తకం ఆధారంగా టాడ్‌ ఫిలిప్స్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ‘జోకర్‌’  సినిమాలోని నటనకుగాను ఫినిక్స్‌కు ఆస్కార్‌ ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది.

దీంతోపాటు బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ (మ్యూజిక్‌) పురస్కారం కూడా వచ్చింది. మన కరెన్సీ, ప్రస్తుత డాలర్‌ – రూపాయి మారకం ప్రకారం చూసుకుంటే.. అప్పట్లో ‘జోకర్‌’ను  రూ. 450 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. సినిమా భారీ విజయం సాధించడంతో రూ. 9000ల కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. మరిప్పుడు సీక్వెల్‌ ఏ స్థాయిలో విజయం అందుకుంటుందో చూడాలి.

ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రీరిలీజ్ అవుతున్న రెండు సినిమాలు.. కానీ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus