జనాలు థియేటర్ కి రావడానికి తగ్గించడం అనే దానికి కారణం టికెట్ రేట్లు, పాప్ కార్న్ రేట్లే కారణం అంటున్నాడు నటుడు జోష్ రవి.అతను మాట్లాడుతూ.. “నేను ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెబుతున్నా. కోటి రూపాయలు పెట్టి సినిమా తీసినా, రూ.100 కోట్లు పెట్టి సినిమా తీసినా, రూ.500 కోట్లు పెట్టి సినిమా తీసినా.. కామన్ మెన్ అది చూడలేని రేంజ్లో ఉన్నప్పుడు అది ఎలా ఆడుతుంది. మధ్య తరగతి జనాలు లేకపోతే ప్రభుత్వమే లేనప్పుడు, వాళ్ళు లేనప్పుడు థియేటర్ ఎలా ఉంటుంది? సినిమా ఎలా బ్రతుకుతుంది? రాక రాక వాడు సినిమా చూడటానికి ఫ్యామిలీతో కలిసి థియేటర్ కి వెళ్తే.. కూల్ డ్రింక్ రూ.250 ఉంటుంది, పాప్ కార్న్ తో కలిపి రూ.500 అవుతుంది.
వాడి జీతం అక్కడే అయిపోతుంది. టికెట్ రేట్ కంటే ఇవే ఎక్కువగా ఉన్నప్పుడు.. సగటు మధ్యతరగతి ప్రేక్షకుడు థియేటర్ కి ఫ్యామిలీతో ఎందుకు వస్తాడు. ఓటీటీలో చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నాడు. అందుకే థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. అలాగే నాకు తెలిసిన కొన్ని థియేటర్లు కళ్యాణ మండపాలు అయిపోయాయి. ఇంకా కొన్ని థియేటర్లు రైస్ మిల్లులు అయిపోయాయి.మా ఊర్లో నేను చిన్నప్పుడు చూసిన చాలా సినిమా థియేటర్లు ఇప్పుడు లేవు.
ఒకరకంగా అవి స్మశానాలు మాదిరి కనిపిస్తున్నాయి. సో సినిమా చచ్చిపోయినట్టే ” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు జోష్ రవి. ఈ విషయాన్ని ఏషియన్ సునీల్ వంటి వాళ్ళు తోసిపుచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని సెంటర్స్ లో ఎక్కువ టికెట్ రేట్లు ఉన్నాయి, ఇంకా కొన్ని సెంటర్స్ లో టికెట్ రేట్లు నార్మల్ గానే ఉన్నాయి. కొన్ని మల్టీప్లెక్సుల్లో పాప్ కార్న్ రేట్లు, కూల్ డ్రింక్స్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి.
కానీ అన్ని మల్టీప్లెక్సుల్లో కాదు. ఇలా చెప్పే ఆడియన్స్ ని భయపెట్టేసి థియేటర్లకు దూరం చేస్తున్నారు అంటూ ఆయన అగ్రెసివ్ గా క్లారిటీ ఇవ్వడం జరిగింది. బహుశా ఆయన ఓ డిస్ట్రిబ్యూటర్ గా ఆలోచించి అలా చెప్పి ఉండొచ్చు. కానీ వాస్తవానికి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలంటే.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది అనేది వాస్తవం.