Josh Ravi, Jr NTR: ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ పై జోష్ రవి ప్రశంసల వర్షం.. అలా చెబుతూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు (Jr NTR) మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దేవర (Devara) , వార్2, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ టాలీవుడ్ నటుడు జోష్ రవి (Josh Ravi) జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు భాషలో ఉండటం మన టాలీవుడ్ ప్రేక్షకుల అదృష్టం అని జోష్ రవి వెల్లడించగా ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. జై లవకుశ సినిమా రిలీజ్ సమయంలో తారక్ నటనను ప్రశంసిస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెడితే కొంతమంది టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్లు చేయడం జరిగిందని జోష్ రవి అన్నారు. జోష్ రవి మంచి పాత్రల్లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కు ఎక్కువ సమయం అవసరం కావడంతో తారక్ దేవర విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దేవర సినిమా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని తారక్ చెప్పిన నేపథ్యంలో ఫ్యాన్స్ సైతం తారక్ మాటలపై నమ్మకంతో ఉన్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సినిమాలకు పారితోషికం తీసుకుంటుండగా మరికొన్ని సినిమాలకు లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా తారక్ రెమ్యునరేషన్ ఉంది. దేవర టీజర్ కొరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు త్వరలో టీజర్ కు సంబంధించిన అప్ డేట్ ను టీమ్ అందిస్తుందేమో చూడాల్సి ఉంది. ఫ్యాన్స్ మెచ్చే సినిమాలకు తారక్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus