Anchor Suma: సుమకి చేదు అనుభవం.. ఘాటు కామెంట్స్ చేసిన రిపోర్టర్

యాంకర్ సుమ.. టాలీవుడ్లో నెంబర్ 1 యాంకర్. అందులో ఎలాంటి డౌట్ లేదు. కేరళకి చెందిన వ్యక్తే అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడుతుంది. దాదాపు 30 ఏళ్ళ నుండి ఆమె ప్రేక్షకులను తన యాంకరింగ్ తో అలరిస్తుంది. బుల్లితెరపై అయినా.. సినిమా వేడుకలో అయినా.. సుమ ఉంటే ఆ సందడే వేరు. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా సుమకి సూపర్ క్రేజ్ ఉంది. ఈ 30 ఏళ్లలో సుమపై ప్రేక్షకుల నుండి కానీ ఎలాంటి కంప్లైంట్ లేదు. అయితే ఈరోజు ఓ సినిమా వేడుకలో ఆమెకి చేదు అనుభవం ఎదురైంది.

ఓ రిపోర్టర్ సుమ పై ఊహించని కామెంట్స్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఈరోజు ‘ఆదికేశవ’ సినిమాకి సంబంధించి ‘లీలమ్మో’ అనే సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. దీనికి సుమ హోస్ట్ చేయడం జరిగింది. అయితే సుమ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు.. ‘స్నాక్స్ ని భోజనంలా తింటున్న మీడియా వారు లోపలి రావాలి’ అంటూ కామెంట్ చేసింది. ఇందుకు మీడియా వారంతా అసహనానికి గురయ్యారు. ఎందుకంటే ఈవెంట్ స్టార్ట్ అయ్యి.. అప్పటికే గంట దాటింది.

సుమ ముందుగానే వచ్చినప్పటికీ స్టేజి పైకి ఎక్కకుండా శేఖర్ మాస్టర్ తో కబుర్లు చెబుతూ కూర్చుంది. ఆమె ముచ్చట్లు అయిపోయాక స్టేజి ఎక్కి మైక్ పట్టుకుంది. అప్పటివరకు ఖాళీగా ఉన్న రిపోర్టర్లు బయట ఉన్న మాట వాస్తవం. దీనికి సుమ ‘వాళ్ళని తిండికి గతిలేక వచ్చినట్టు కామెంట్ చేసింది’ అని వాళ్ళు ఫీలయ్యారు. అందుకో ఓ రిపోర్టర్.. ‘సుమ గారు మీ హోస్టింగ్ అంటే మాకు ఇష్టం. చాలా సరదాగా హోస్ట్ చేస్తారు. అందరిలో ఎనర్జీని నింపుతారు.

కానీ మీడియా వారిని మీరు ‘స్నాక్స్ ని భోజనంలా తింటున్నట్టు తింటున్నారు’ అంటూ మాట్లాడటం పద్దతిగా లేదు’ అంటూ కామెంట్ చేశాడు. అందుకు సుమ.. ‘సరే మీరు స్నాక్స్ ని స్నాక్స్ లానే తిన్నారు’ అంటూ మళ్ళీ వెటకారంగా కామెంట్ చేసింది. అప్పుడు మళ్ళీ ఆ రిపోర్టర్.. ‘అదే.. ఇలాంటి కామెంట్స్ మానేయండి ప్లీజ్’ అంటూ మళ్ళీ మండిపడ్డాడు. దీంతో సుమ (Anchor Suma) బాగా హర్ట్ అయ్యింది. ఆ ఈవెంట్ కూడా త్వరగానే ముగించేసి వెళ్ళిపోయింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus