ప్రముఖ జర్నలిస్ట్, బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అయిన జాఫర్ ఇటీవల ‘ఇట్లు మీ జాఫర్’ అనే ఓ యూట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించి ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బండ్ల గణేష్ తో నిర్వహించిన ఇంటర్వ్యూ వివాదాస్పదమైంది. ఈ ఇంటర్వ్యూలో భట్రాజు అనే పదాన్ని వాడారు. దీంతో ఆ కమ్యూనిటీ వారు హర్ట్ అయ్యారు. దీంతో జాఫర్ క్షమాపణలు చెబుతూ ఓ వీడియోని విడుదల చేశారు.
ఇందులో జాఫర్ మాట్లాడుతూ… “ఇటీవల నేను బండ్ల గణేష్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నేను ఒక పదాన్ని వాడాను. ‘మీ మాటలు పొగడ్తలు.. భట్రాజు పొగడ్తలుగా ఉన్నాయి’ అని అన్నాను. అది చూసి చంద్రకళ గారు నాకు ఫోన్ చేశారు. భట్రాజుల ఆత్మగౌరవ ప్రతీకగా పిలవబడుతున్న చంద్రకళ గారు నాకు ఫోన్ చేసి.. ఇలా మాట్లాడారేంటి? అని అడిగారు. భట్రాజుల కమ్యునిటీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రకళ. ఆ పదం వాడినందుకు నన్ను నిలదీశారు.
‘నిజంగా చెప్తున్నా.. నేను ఆ పదం వాడినందుకు చాలా బాధపడ్డాను.. పశ్చాత్తాపపడ్డాను. నా ఉద్దేశం అది కాదు కానీ.. ఒక కమ్యునిటీకి సంబంధించిన పదాన్ని నేను ఎందుకు వాడానని బాధపడ్డాను.ప్రమాణం చేసి చెప్తున్నా..నేను ఎవరినీ కించపరచడానికి ఆ పదం వాడలేదు. ఏదో ఫ్లోలో వచ్చేసిన మాట అది. అది రాంగ్‌గా వచ్చింది కాబట్టి.. మీ అందరికీ సిన్సియర్‌గా క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకంటే.. ఆ కమ్యునిటీపై నాకు ఎంతో గౌరవం ఉంది.
సమాజానికి సేవ చేసిన కమ్యునిటీ అది. చదువు నేర్పించిన కమ్యునిటీ అది. మీ వృత్తే చదువు చెప్పడం. కృష్ణరాయుల విజయానికి భట్టుమూర్తే కారణం అంటారు. అంతటి గొప్ప చరిత్ర మీది. పుట్టపర్తి సాయిబాబా లాంటి గొప్ప గొప్ప మహానుభావులు ఉన్న కులం మీది.కానీ నేను ఫ్లోలో ఆ పదం వాడేశాను. మిమ్మల్ని కించపరచలేదు. మీకు క్షమాపణ చెప్పడంతో పాటు.. ఆ ఇంటర్వ్యూలో నేను వాడిన పదాన్ని తొలగిస్తున్నాను. నన్ను మరోసారి క్షమించండి” అంటూ చెప్పుకొచ్చాడు.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్