మాటల మాంత్రికుడికి ఎన్టీఆర్ కీలక సూచన..!

రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పూర్తయిన వెంటనే.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యాలని ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నాడు. ఇది ఎన్టీఆర్ కు 30వ చిత్రం. ఇప్పటికే 70శాతం స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ పూర్తి చేశాడు. నిజానికి ఈ ఏడాది జూలై నుండే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని ఎన్టీఆర్ కూడా అనుకున్నాడు. కానీ సీన్ రెవర్స్ అయ్యింది. లాక్ డౌన్ కారణంగా ఇప్పటి వరకూ వేసుకున్న ప్లాన్ అంతా అప్సెట్ అయ్యింది.

‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ చాలా బ్యాలన్స్ ఉంది కాబట్టి.. ఇప్పట్లో త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ల సినిమా మొదలయ్యే అవకాశం లేదనే చెప్పాలి.కానీ ఎన్టీఆర్ మాత్రం.. త్రివిక్రమ్ ను తొందర పెడుతున్నాడట. వివరాల్లోకి వెళితే.. ‘ఆర్.ఆర్.ఆర్’ లో తన షెడ్యూల్ పూర్తయిన వెంటనే.. త్రివిక్రమ్ మూవీ మొదలు పెట్టాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఈ విషయాన్ని త్రివిక్రమ్ కు కూడా ఇటీవల కాల్ చేసి చెప్పాడట. 2021 ఎండింగ్ లోపు ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా స్టార్ట్ చెయ్యడానికి ఎన్టీఆర్ ..

నిర్మాతలు ‘మైత్రి మూవీ మేకర్స్’ వారికి ఎప్పుడో డేట్స్ ఇచ్చాడట. కాబట్టి తనకు ఎప్పుడు వీలైతే అప్పుడు షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీగా ఉండమని త్రివిక్రమ్ ను కోరాడట ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ ప్లాన్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus