కొన్ని సినిమాల కథలు ఒకేలా అనిపించినా కథనాలు వేరేలా ఉంటాయి.రచయిత పరుచూరి గారు చెప్పినట్టు ‘దేవదాసు’ ‘అర్జున్ రెడ్డి’ సినిమాల కథలు ఒకటే… కానీ వాటి కథనాలు వేరు. అవి రెండు చరిత్ర సృష్టించాయి. కొన్ని సినిమాలు కథలు ఒకేలా అనిపించినా వాటి కథనాలు ప్రేక్షకులను రంజింప చేస్తేనే వాటి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. లేదంటే కష్టమే..! అయితే కొన్ని సార్లు హీరోల ఇమేజ్ ను బట్టి కూడా ప్లాప్ కథల ఫలితాలు తారుమారవుతాయి.
సరిగ్గా ఇప్పుడు అదే విషయం గురించి మాట్లాడుకుందాం. యాక్షన్ హీరో గోపీచంద్ చేసిన కథతోనే ఎన్టీఆర్ ఓ సినిమా చేసాడు. ఈ రెండు సినిమాల ఫలితాల్లో పెద్దగా తేడా అయితే లేదు. విషయం ఏంటంటే.. 2011 వ సంవత్సరంలో గోపీచంద్ హీరోగా బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో ఓ సినిమా వచ్చింది. అదే ‘వాంటెడ్’. అల్లరి చిల్లరిగా తిరిగే హీరో హీరోయిన్ ప్రేమలో పడతాడు. కానీ హీరోయిన్ అతన్ని ప్రేమించాలంటే విలన్ ఫ్యామిలీని చంపాలని షరతులు పెడుతుంది.
హీరోయిన్ ఫ్యామిలీ అంతా విలన్ వల్ల చనిపోతారు. అది ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. సరిగ్గా ఇదే కథని ఎన్టీఆర్ తో ‘ఊసరవెల్లి’ గా తీసాడు సురేంద్ర రెడ్డి. 2011 లోనే దసరా కానుకగా ఈ చిత్రం విడుదలైంది. ‘వాంటెడ్’ డిజాస్టర్ అయ్యింది. ‘ఊసరవెల్లి’ బిలో యావరేజ్ అన్నట్టు ఆడింది. ‘వాంటెడ్’ సినిమాని చూసి కొన్ని ఛేంజెస్ చేసినా ‘ఊసరవెల్లి’ ఫలితం బెటర్ గా ఉండేదేమో. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ విలన్ ప్రకాష్ రాజే. హీరోయిన్ ఫ్యామిలీలో ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్ మెంబెరే..!
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!