టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కాంబినేషన్‌గా పేరున్న ఎన్టీఆర్ (Jr NTR) – సుకుమార్ (Sukumar) మరోసారి కలసి సినిమా చేయబోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్‌కు నిదర్శనంగా తాజాగా వచ్చిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన ఆ పిక్‌లో తారక్, సుక్కు ప్రేమతో కదిలిపోతున్నట్టే కనిపించారు. ఈ ఫోటోలో సుకుమార్ భుజంపై తారక్ వాలుతూ ఉన్నట్టు ఉండగా, “ప్రేమతో” అంటూ తబిత క్యాప్షన్ ఇచ్చారు.
ఆ తర్వాత తారక్ అదే ఫోటోను రీపోస్ట్ చేస్తూ “నన్ను వెంటాడే ఎమోషన్” అని సుకుమార్‌ను ట్యాగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక ఫ్రెండ్‌మొమెంట్ కాదు, కొత్త ప్రాజెక్ట్‌కు పూనుకోబోతున్న సంకేతం అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఈ పిక్ వచ్చిన తర్వాత, ఎన్టీఆర్, సుకుమార్ మళ్లీ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా “నాన్నకు ప్రేమతో” (Nannaku Prematho) లాంటి ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ కాంబో మరోసారి స్క్రీన్ మీద రిపీట్ అయితే, అది ఫ్యాన్స్‌కు పండగే. ఇప్పుడే ప్లానింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించబడవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి ఎన్టీఆర్ “వార్ 2” (War 2) చిత్రంలో హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan) కలిసి నటిస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్‌లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు కూడా కమిట్ అయ్యారు.
మరోవైపు సుకుమార్ రామ్ చరణ్ (Ram Charan) న్యూ ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నా, ఆ సినిమా తర్వాత “పుష్ప 3” స్కెచ్ కూడా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా తారక్ సుకుమార్ మళ్లీ కలిసి పని చేయబోతున్నారనే సంకేతాలు ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారాయి. ఇద్దరూ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో తెలియాల్సి ఉన్నా, అభిమానుల ఉత్సాహం మాత్రం ఊహించని స్థాయిలో ఉంది. త్వరలో ఈ కాంబోపై క్లారిటీ వస్తే.. టాలీవుడ్‌లో మళ్లీ ఓ ఎమోషనల్ క్లాసిక్ పుట్టే అవకాశముంది.